Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట తప్పదు…

జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట తప్పదు.

జర్నలిస్టులకు ఇచ్చిన మాటను కెసిఆర్ తప్పారు.

గ్రామీణ ప్రాంత విలేకరులు ఈ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు  కట్టెకోల రాంనారాయణ 

 

తెలంగాణ రాష్ట్రంలో ఫ్రంట్లైన్ వారియర్ గా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పట్ల త్వరలోనే టి యు డబ్ల్యు యు జే (ఐ జే యు) ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధం కావాలని గ్రామీణ జర్నలిస్టులకు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టెకోల రాంనారాయణ    పిలుపునిచ్చారు. గురువారం శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన మధిర యూనియన్ మీటింగ్ కు రాష్ట్ర నాయకులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు రాం నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టులు నేడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇళ్ల స్థలాలు లేక అద్దె ఇళ్లల్లో జీవితం కొనసాగిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హెల్త్ కార్డులు ఇచ్చి ఆసుపత్రికి వెళితే జర్నలిస్టు సరైన వైద్యం అందించడం లేదని వారు తెలిపారు. ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జర్నలిస్ట్ జీవితాలు మారతాయా అనుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన మాటను విస్మరించారని ఆయన విమర్శించారు. త్వరలోనే టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు. అనంతరం యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర నాయకులు ప్రారంభించి సభ్యులకు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మధిర కి వచ్చిన యూనియన్ నాయకుల ను శాలువాలతో మధిర జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకట్రావు ఉపాధ్యక్షులు ఖాదర్ సీనియర్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా నాయకులు ప్రసేన్, ఏనుగు వెంకటేశ్వర్లు వనం వెంకటేశ్వర్లు మైసా పాపారావు చెరుకు శ్రీనివాసరావు, దేవదానం ,మధిర జర్నలిస్టులు జి.వి యోగేష్ , బాలస్వామి, మక్కెన నాగేశ్వరరావు, శశి కుమార్, తాళ్లూరి అప్పారావు, సాంబిరెడ్డి, కిషోర్, కొంగర మురళి, మువ్వ మురళి, మువ్వా రామకృష్ణ ఎడవల్లి శ్రీధర్ ,పసుపులేటి శ్రీనివాసరావు నాళ్ళ శ్రీనివాసరావు, అరుణ్ కొంగర విజయ్ శ్యామ్ నందిపాటి చిన్నబాబు, రాజేష్, జగదీష్ ,మధు రాము, వినోద్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Drukpadam

విద్యుత్ బిల్లు ప్రతి నెలా మీరు చెల్లించక్కర్లేదు.. పేటీఎంలో ఆటో పే ఆప్షన్!

Drukpadam

కోర్టులో ఫోన్ మోగడంతో జడ్జ్ గుస్సా.. వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలికి జరిమానా…!

Drukpadam

Leave a Comment