Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడిన నగరవాసులు!

  • గాజువాక, మధురవాడ సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు
  • కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి
  • నిద్రలో ఉలిక్కిపడి బయటకు పరుగులు తీసిన ప్రజలు

విశాఖపట్నం నగరంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. నగర ప్రజలు గాఢ నిద్రలో ఉండగా, భూమి కొన్ని సెకన్లపాటు కంపించడంతో భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

వివరాల్లోకి వెళితే, ఈరోజు తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 గంటల మధ్య ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు.

అకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామంతో నిద్ర నుంచి ఉలిక్కిపడిన నగరవాసులు ఏం జరుగుతోందో తెలియక ఆందోళన చెందారు. భయంతో కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల నుంచి బయటకు వచ్చి రోడ్లపై గుమికూడారు. కొంతసేపటి వరకు ఇళ్లలోకి వెళ్లడానికి కూడా జంకారు. అయితే, ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైందనే వివరాలు ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. 

Related posts

తెలంగాణ ఎన్నికల ఫలితంపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర విశ్లేషణ

Ram Narayana

వందేళ్ల క్రితం నాటి రామప్ప దేవాలయం.. సోషల్​ మీడియాలో ఫొటో చక్కర్లు!

Drukpadam

టర్కీ లో జరిగిన మాపెళ్లి ఈ దేశంలో చెల్లదంటున్న తృణమూల్ ఎంపీ నస్రత్ జహాన్…

Drukpadam

Leave a Comment