Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏపీ లో కొత్త జిల్లాల పేర్లు , జిల్లా కేంద్రాలపై రగులుతున్న చిచ్చు!

ఏపీ లో కొత్త జిల్లాల పేర్లు , జిల్లా కేంద్రాలపై రగులుతున్న చిచ్చు!
రాజంపేటలో భారీ ర్యాలీ.. హిందూపురంలో భజరంగ్ దళ్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం!
అన్నమయ్య జిల్లా కేంద్రంగా ప్రకటించాలని రాజంపేటలో నిరసనలు
ర్యాలీ చేపట్టిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు
శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంగా హిందూపురంను ప్రకటించాలంటూ కొనసాగుతున్న బంద్ కార్యక్రమం
కోనసీమ జిల్లాను అంబెడ్కర్ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్
లేదు బాలయోగి జిల్లాగా ప్రకటించాలని మరో డిమాండ్
తిరుపతి కేంద్రంగా బాలాజీ జిల్లా తిరుపతి బాలాజీగా పెట్టాలని విజ్ఞప్తులు
కృష్ణా జిల్లాకు విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ కృష్ణా పెట్టాలని సూచనలు
వంగవీటి రంగా జిల్లా కృష్ణా జిల్లాగా పెట్టాలని మరో వర్గం వాదన

ఏపీ లో ఒక పక్క పీఆర్సీ పై ఉద్యోగులు ఉద్యమ బాటపడితే మరో పక్క కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చింది. జిల్లా కేంద్రాలు వాటి పేర్లపై అనేక ప్రాంతాలలో ప్రజలు ఆందోళనలు చేపట్టారు . ప్రధానంగా కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో ఏర్పడే జిల్లాకు అన్నయ్య జిల్లాగా నామకరణం చేసి జిల్లా కేంద్రం రాయచోటిలో పెట్టేందుకు ప్రభుత్వం సిద్దపడగ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటనే జిల్లా చేయాలనీ డిమాండ్ బలంగా వస్తుంది. దీంతో రాజంపేట లో పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.విద్యార్థలు , ఉపాద్యాలు , రాజకీయపార్టీలు ఒక్కటై రాజంపేట జిల్లా కేంద్రంగా అన్నయ్య జిల్లా ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేస్తున్నాయి. అదే విధంగా అనంతపురం జిల్లాను విభజించి హిందూపూర్ పార్లమెంట్ నియోజవర్గం ను పుట్టపర్తి కేంద్రంగా జిల్లా చేసేందుకు ప్రభుత్వం సిద్దపడగా లేదు హిందూపూర్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనీ డిమాండ్ పెరుగుతుంది. టీడీపీకి చేయండిన హిందూపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ సైతం హిందూపూర్ కేంద్రంగా జిల్లా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కృష్ణా జిల్లా పేరు విజయవాడ కేంద్రంగా స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించగా కృష్ణా నది ఒడ్డిన ఉండి చారిత్రక ప్రాధాన్యత ఉన్నందున ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పెట్టాలని కొందరు సూచిస్తున్నారు. మరికొందరు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు . తూర్పు గోదావరి లోని కోనసీమ జిల్లా కేంద్రం భీమవరం లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించగా దాన్ని నర్సాపురం లో పెట్టాలని డిమాండ్ ఉండి. అంతే కాకుండా జిల్లా పేరును కోనసీమలో పాటు అంబెడ్కర్ జిల్లా గా నామకరణ చేయాలనీ శాసనసభ్యులు వరప్రసాద్ కోరుతున్నారు . మరికొందరు స్వర్గీయ జి ఎం సి బాలయోగి జిల్లాగా నామకరణ చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని జిల్లాలకు కూడా పేర్లు జిల్లా కేంద్రాల విషయంలో అభ్యంతరాలు ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇటీవల ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాల కేంద్రాలను మార్చాలంటూ కొన్నిచోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాజంపేట కేంద్రంగా అన్నమయ్య జిల్లాను, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ప్రభుత్వం ప్రకటించింది.

ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ప్రకటించడంపై రాజంపేటలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈరోజు విద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీని చేపట్టారు. ఈర్యాలీ రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా పాత బస్టాండ్ వద్ద విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించారు. వీరికి న్యాయవాదులు కూడా జతకలిశారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు.

మరోవైపు హిందూపురంలో అఖిలపక్షం బంద్ కు పిలుపునిచ్చింది. ఆర్టీసీ బస్టాండులో బస్సులను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో భజరంగ్ దళ్ కు చెందిన ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.

Related posts

కేసీఆర్‌పై వైఎస్ షర్మిల మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు!

Drukpadam

మునుగోడులో ఓట్లు బీసీలవి …సీట్లు ఓసీలవి ఇదెక్కడి సామాజిక న్యాయం ….?

Drukpadam

మా స‌హ‌నాన్ని ప‌రీక్షించ‌కండి… వైసీపీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ వార్నింగ్‌!

Drukpadam

Leave a Comment