Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మధిర 100 పడకల ఆసుపత్రి ఎవరి ఖాతాలో…

మధిర 100 పడకల ఆసుపత్రి ఎవరి ఖాతాలో…
-ఎమ్మెల్యే భట్టి వర్సెస్ జడ్పీ చైర్మన్ లింగాల
-తాను ఎప్పటినుంచే 100 ఆసుపత్రి కావాలని అడుగుతున్నానన్న భట్టి
-కాంగ్రెస్ అధికారంలో ఉండగా 100 పడకల ఆసుపత్రి ఎందుకు మంజూరు కాలేదన్న లింగాల
-2023 అసెంబ్లీ టికెట్ కోసం ఇప్పటినుంచే పోటాపోటీ …
-భట్టికి టికెట్ గ్యారంటీ , మరి లింగాల కేసీఆర్ దగ్గర మంచి మార్కులు తెచ్చుకొంటేనే …

మధిర 100 పడకల ఆసుపత్రి ఎవరి ఖాతాలో అనేది ఇప్పుడు అక్కడ ప్రజల మదిలో సందేహాలు రేపుతున్న ప్రశ్న …సీఎల్పీ నేత స్థానిక శాసనసభ్యుడు మల్లు భట్టి విక్రమార్క తన కృషివల్లనే మధిరకు 100 పడకల ఆసుపత్రి మంజూరు అయిందని అంటున్నారు. అయితే అదేంకాదు తన కృషివల్ల నే ఆసుపత్రి మంజూరి అయిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అంటున్నారు . గత ఎన్నికల్లో టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన లింగాల కమల్ రాజ్ ఓడిపోయారు . అనంతరం ఆయన జడ్పీ చైర్మన్ గా గెలుపొందారు . మధిర నియోజకవర్గం మీద ద్రుష్టి పెట్ట నిరంతరం పర్యటనలు చేస్తున్నారు. అధికార పార్టీ అయినందున తన ఖాతాలో వేసుకోవడం ద్వారా మైలేజ్ పొందాలని చూస్తున్నారు. అందుకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న భట్టి కూడా నియోజకవర్గంలో జరుగుతున్నా అభివృద్ధి తన కృషి మేరకే జరుగుతుందని 100 పడకల ఆసుపత్రి ప్రతిపాదనలు ఎప్పటినుంచో ఉన్నాయని చెబుతున్నారు. అసెంబ్లీ లో మధిరలో 100 పడకల ఆసుపత్రి విషయం గురించి సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు . నియోజకవర్గ అభివృధ్ధికోసం అనేక ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చిన సంగతి ఆయన ఉదహరిస్తున్నారు.

2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరికీ వారు 100 పడకల ఆసుపత్రి తమ ఘనత అంటే తమ ఘనత అంటున్నారు. అయితే మొత్తం మీద ఎవరి ఘనత అయినా మధిర ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగమే కదా అని ప్రజలు అంటున్నారు. ఇద్దరు పోటీ పడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే సంతోషిస్తామని పేర్కొంటున్నారు.

మధిర సత్తుపల్లి , అశ్వారావు పేట , భద్రాచలం నియోజకవర్గాలు ఉమ్మడి జిల్లాలో మిగతా నియోజవర్గాల కొంచెం భిన్నంగా ఉంటాయి. ఇక్కడ ప్రజలకు మిగతా ప్రాంతాలకంటే చైతన్యం కాస్త ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఎన్నికల నాటికీ ఎవరిని గెలిపించాలో వారిని గెలిపిస్తారు .నియోజవర్గంలో ప్రజల అవసరాలు తీర్చి , వారికీ అందుబాటులో ఉండే నేతను అక్కున చేర్చుకుంటారు. అందుకోసం భట్టి ,లింగాల పోటీపడుతున్నారు. భట్టికి టికెట్ గ్యారంటీ అందంలో సందేహం లేదు . మరి లింగాల విషయంలో ఆలోచించాల్సిందే ఎందుకంటే టీఆర్ యస్ అధినేత కేసీఆర్ కు చాలా లెక్కలు ఉంటాయి. ఆయన నివేదికలు ఆయనకు ఉన్నాయి. పైగా ఇంటలిజెన్స్ రిపోర్టులు ,బలమైన అభ్యర్థి ఎవరు అనేది పరిపరి విధాలుగా ఆలోచన చేసి టికెట్స్ కేటాయింపులు ఉంటాయి . అందువల్ల లింగాల అభివృద్ధి మాత్రమే కాదు కేసీఆర్ దగ్గర మంచి మార్కులు సంపాదించాలిసేందే …

Related posts

పొంగులేటి నిర్ణయం ఆలశ్యం సరే …ఆమోదయోగ్యంగా ఉంటుందా….?

Drukpadam

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై ఈడీ కొరడా…భగ్గుమన్న రౌత్

Drukpadam

పవన్ కల్యాణ్ హత్యాయత్నానికి పాల్పడ్డారు…భూమన

Drukpadam

Leave a Comment