Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

వ్యాక్సిన్ తీసుకోకుండా ప్రాణం మీదకు తెచ్చుకున్న చెక్ జానపదగాయని హనా హోర్కా!

వ్యాక్సిన్ తీసుకోకుండా ప్రాణం మీదకు తెచ్చుకున్న చెక్ జానపదగాయని హనా హోర్కా!
-వ్యాక్సిన్ వద్ద అని ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు
-సహజ సిద్ధంగా శరీరంలో వృద్ధి చెందే రోగనిరోధకశక్తి మేలు అని చెప్పేవారు
-ఆమె భర్త ,కొడుకు వ్యాక్సిన్ తీసుకున్న ఆమె నిరాకరించారు
-కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమమే తన తల్లి ప్రాణాలు తీసిందన్న కొడుకు రేక్

చెక్‌ దేశానికి చెందిన ప్రముఖ జానపద గాయని హనా హోర్కా ఇటీవల మరణించారు. మరణించే వరకు ఆమె వ్యాక్సినేషన్‌ వద్దు అనే ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. వాక్సిన్ వ్యతిరేక ప్రచార సంస్థల ప్రభావంతో కరోనాకు విరుడుగా వ్యాక్సినేషన్‌ వద్దని శరీరంలో సహాజ సిద్ధంగా వృద్ధి చెందే రోగ నిరోధకత శక్తియే మేలు అంటూ తరచుగా చెప్పేవారు. ఆమె భర్త, కొడుకు వ్యాక్సిన్‌ తీసుకున్నా హనా హోర్కా మాత్రం టీకాకు దూరంగా ఉన్నారు.

శరీరంలో ఉండే సహాజ రోగ నిరోధక శక్తి ప్రభావం అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో హనా హోర్కా ఏరికోరి కరోనా తెచ్చుకున్నారు. చనిపోవడానికి రెండు రోజుల ముందు సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్స్‌తో మాట్లాడుతూ. తనకు కరోనా వచ్చిందని, టీకా తీసుకోకపోయినా తాను దాన్ని జయించబోతున్నట్టుగా మాట్లాడారు. కానీ ఆ తర్వాత రెండు రోజులకే ఆమె మరణించారు. వాక్సిన్ వ్యతిరేక ఉద్యమ సంస్థల ప్రచారం ప్రభావానికి లోనవడం వల్లే తన తల్లి టీకా తీసుకోకుండా ప్రాణాలు కోల్పోయిందటూ ఆమె కొడుకు రెక్‌ తెలిపాడు.

కాబట్టి కరోనా వాక్సిన్ తీసుకోండి. ఇదంతా మెడికల్ మాఫియా, వాక్సిన్ మాఫియా అని కరోనా వాక్సిన్ తీసుకున్నాక కూడా చాలా మంది మరణిస్తున్నారు అని సొల్లు చెప్పే పిడి గభ్యుదయ వాదుల వలలో పడకండి.

వ్యాక్సీన్ వేసుకున్న తరువాత కూడా కరోన సోకవచ్చు. కానీ వ్యాక్సీన్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. త్వరగా కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కరోనాతో మరణించే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి వాక్సిన్ వేయించుకోండి. ప్రాణాలు కోల్పోయే అవకాశం తగ్గించుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి.

Related posts

ఏపీ సీఎం జగన్ జార్ఖండ్ సీఎం సొరేన్ కు సుద్దులు చెప్పటంపై అభ్యతరం

Drukpadam

సంక్షోభంలో చిక్కుకున్న భారత్‌కు సాయం చేద్దాం రండి: పిలుపునిచ్చిన ‘లాన్సెట్’…

Drukpadam

కరోనా నేపథ్యం లో పెద్ద ఎత్తున డాక్టర్లను నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం

Drukpadam

Leave a Comment