అమరావతి భూముల వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఆదేశం
-మాజీ మున్సిపల్ పట్టణాభివృద్దిశాఖమంత్రి నారాయణకు సైతం నోటీసులు
-కంగుతిన్న టీడీపీ వర్గాలు
అమరావతి భూములు అమ్మకాలు కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ గతంలోనే చంద్రబాబు నాయుడు పై అనేక ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాదులో చంద్రబాబు నివాసానికి ఏపి సిఐడి అధికారులు వెళ్లి 41 సిఆర్ పి సి కింద నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి నారాయణ కు సైతం సిఐడి అధికారులు నోటీసులు అందజేశారు.
ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని, 40 వేలు విలువచేసే గజం భూమిని కొందరు మంత్రుల బంధువులకు, కుటుంబ సభ్యులకు కేవలం 14 వందలకే అమ్మకాలు చేశారని , వీటిపై విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు.
అమరావతి రాష్ట్ర రాజధాని కాబోతుందని ముందుగానే నిర్ణయుంచి ఆ సమాచారాన్ని సహచరులకు సన్నిహితులకు చేరవేసి వేలాది ఎకరాలు సేకరించి వారు కొనుగోలు చేసేలా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములు తక్కువ ధరకు అమ్మడం, విలువైన ప్రైవేటు భూములను రాజధాని పేరుతో తక్కువ ధరకు సేకరించడం, వాటిని తిరిగి బంధుగణం కు దక్కేలా చేయడం వంటివి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గా సిఐడి వర్గాలు ప్రాధమిక విచారణలో తెలింది .దీనిపై అసెంబ్లీలో కూడ పెద్ద దుమారం లేచింది.
అమరావతి భూముల వ్యవహారం ఎపి రాజకీయాలలో హట్ గా మారింది.మరికొంత మందిపై విచారణ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది