రాజకీయ వార్తలు

మణిపూర్ లో ఒంటరిగానే పోటీ.. అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ!

మణిపూర్ లో ఒంటరిగానే పోటీ.. అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ!
సొంత నియోజకవర్గం నుంచే సీఎం బీరేన్ సింగ్
మళ్లీ అధికారంలోకి వస్తామన్న కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్
పార్టీ కోసం పనిచేసిన వారికే టికెట్లు ఇచ్చామని కామెంట్

చిన్న రాష్ట్రమైన మణిపూర్ లో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయనున్నది. అక్కడ చిన్న చితక పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నప్పటికీ అది బెడిసి కొట్టడంతో బీజేపీ అధిష్టానం సూచనలమేరకు ఒంటరిగా పోటీకి సైఅంటున్నది. దీంతో రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలలో రెండుదఫాలుగా జరగనున్న ఎన్నికల్లో మొత్తం 60 నియోజకవర్గాలకు పోటీచేసే బీజేపీ అభ్యర్థుల జాబితాను నేడు ప్రకటించారు.

మణిపూర్ లో ఒంటరిగానే పోటీ చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిర్ణయించింది. మొత్తం 60 నియోజకవర్గాల్లోనూ పోటీకి నిశ్చయించుకుంది. ఈ మేరకు ఇవాళ పార్టీ 60 అభ్యర్థులను ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్.. తన సిట్టింగ్ స్థానం హేంగాంగ్ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగనున్నారు.

మణిపూర్ లో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని అభ్యర్థుల జాబితా ప్రకటించే సందర్భంగా కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. బీజేపీ హయాంలోనే మణిపూర్ ప్రశాంతంగా ఉందని, అభివృద్ధి జరుగుతోందని భూపేందర్ యాదవ్ అన్నారు. దీర్ఘకాలంపాటు బీజేపీ కోసం పనిచేసిన వారికే టికెట్ ఇచ్చామని చెప్పారు. క్రీడలు, అధికారులు, విద్యావేత్తలకూ టికెట్లు ఇచ్చామని వెల్లడించారు. కాగా, ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Related posts

హైదరాబాద్‌కు అఖిలేశ్ యాదవ్, సీఎం కేసీఆర్‌తో భేటీ…!

Drukpadam

కాశ్మీర్ హక్కుపై గళమెత్తే హక్కు మాకే ఉందంటూ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్న తాలిబన్లు!

Drukpadam

అలా చేస్తే లీటర్ పెట్రోల్ రూ. 70కి, డీజిల్ రూ. 60కే ఇవ్వొచ్చు: కేటీఆర్!

Drukpadam