Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

విజయవాడలో బాలిక ఆత్మహత్య… టీడీపీ నేతలపై రోజా ఆగ్రహం!

విజయవాడలో బాలిక ఆత్మహత్య… టీడీపీ నేతలపై రోజా ఆగ్రహం!

  • 9వ తరగతి బాలికపై టీడీపీ నేత వేధింపులు
  • అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య
  • వినోద్ జైన్ పై పోక్సో కేసు, అరెస్ట్
  • తప్పుడు పనులు చేసేది టీడీపీ నేతలే అన్న రోజా
  • ఇతరులపైకి నెడుతుంటారని వ్యాఖ్యలు

విజయవాడ భవానీపురంలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. టీడీపీ నేత వినోద్ జైన్ తనను వేధిస్తున్న విధానాన్ని ఆమె తన పుస్తకంలో రాసినట్టు వెల్లడైంది. సదరు టీడీపీ నేత కూడా బాలిక నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉంటున్నాడు. టీడీపీ నేత వినోద్ జైన్ ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. బాలిక ఆత్మహత్య ఘటన నేపథ్యంలో టీడీపీ వినోద్ జైన్ ను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. బాలిక మృతిపై పోక్సో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్ జైన్ ను అరెస్ట్ చేశారు.

ఈ ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బాలిక ఆత్మహత్యపై టీడీపీ నేతలు ఏంచెబుతారని నిలదీశారు. బాలిక బలవన్మరణానికి పాల్పడడం బాధాకరమని అన్నారు. స్త్రీలపై వేధింపులకు పాల్పడే టీడీపీ నేతలు నారీ సంకల్ప దీక్ష ఎలా చేస్తారని రోజా ప్రశ్నించారు.

60 ఏళ్ల వ్యక్తి బాలికను తండ్రిలా చూసుకోవాల్సింది పోయి, ఎలా వేధించాడో ఆ బాలిక పుస్తకంలో రాసుకున్న దాన్నిబట్టి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. తప్పుడు పనులు చేసేది టీడీపీ నేతలే అని, దాన్ని ఇతరులపైకి నెడుతుంటారని ఆరోపించారు. అటు, ఆసుపత్రి మార్చురీ వద్ద బాలిక మృతదేహాన్ని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులను ఓదార్చారు.

వినోద్ జైన్ వంటి నీచులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు: మంత్రి వెల్లంపల్లి

Vellampalli fires on Vinod Jain and Chandrababu

విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ రంగు దుమారం రేపుతోంది. బాలిక ఆత్మహత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత వినోద్ జైన్ ను పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. దీనిపై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో స్పందించారు. వినోద్ జైన్ తనను ఎలా ఇబ్బందిపెట్టాడో ఆ బాలిక మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని వెల్లడించారు. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదని, బాలిక ఆత్మహత్యపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.

అసలు, అంత వయసున్న వ్యక్తికి ఈ బుద్ధి ఎలా వచ్చిందోనని అన్నారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని, వినోద్ జైన్ ను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వినోద్ జైన్ ఎంపీ కేశినేని నానికి ముఖ్య అనుచరుడు అని, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అతడి కోసం చంద్రబాబు కూడా ప్రచారం చేశాడని వెల్లంపల్లి ఆరోపించారు. ఇలాంటి నీచులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

Related posts

ఏపీ లో సంచలనం …అమరావతి ల్యాండ్ పూలింగ్ లో చంద్రబాబు పై కేసు ..

Drukpadam

నా చెల్లెల్ని కూడా పెళ్లాడితేనే మన పెళ్లి జరుగుతుంది’ ఓకే అన్న యువకుడు

Drukpadam

ఏపీ లో వలంటీర్ల వ్యవస్థపై కౌంటర్ ఎన్ కౌంటర్… పవన్ వర్సెస్ జగన్

Drukpadam

Leave a Comment