Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదు: ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు!

ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదు: ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు!

  • సమ్మెకు సిద్ధమవుతున్న ఏపీ ఉద్యోగులు
  • ఎస్మా ప్రయోగించేందుకు సర్కారు సిద్ధమని కథనాలు
  • స్పందించిన బొప్పరాజు
  • ఉద్యమం ఆపబోమని వెల్లడి

సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోందని కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందించారు. ఎస్మా చట్టం ప్రయోగించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఆయన ఇవాళ శ్రీకాకుళం ఎన్జీవో హోమ్ వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న ఉద్యోగులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర సర్కారు తమ డిమాండ్లు అంగీకరించేంత వరకు పోరాటం ఆపేది లేదని వెల్లడించారు. డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం చుట్టూ మూడేళ్లు తిరిగామని, ఇంకా తమను మోసం చేసే ప్రయత్నాలు చేయొద్దని అన్నారు. మంత్రుల కమిటీతో చర్చలకు ఉద్యోగులు ముందుకు రావడంలేదంటూ తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగులకు, సర్కారుకు మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించవద్దని మంత్రులనుద్దేశించి వ్యాఖ్యానించారు.

Related posts

పునీత్ మృతిపై రజనీకాంత్ సంతాపం.. కన్నింగ్ ఫెలో అంటూ రజనీపై విమర్శల వెల్లువ!

Drukpadam

మండల కేంద్రం కాబోతున్న ఎంపీ గాయత్రీ రవి సొంత గ్రామం ఇనగుర్తి …?

Drukpadam

వచ్చే నెల 15 నుంచి తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ…

Drukpadam

Leave a Comment