Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కరోనా పాజిటివ్!

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు కరోనా పాజిటివ్!
-ఇటీవల మంత్రి హరీష్ రావు పర్యటన సందర్భంగా విరామం లేకుండా తిరిగిన సండ్ర
-మంత్రి పర్యటన తరువాత పాజిటివ్ రావడం పై ఆందోళన లేదన్న ఎమ్మెల్యే
-తనను కలిసినవారందరు టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి

సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య  కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన కొవిడ్‌ పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం తాను ఖమ్మంలో తన నివాసంలో హోమ్‌ క్యారంటైన్‌లో ఉన్నట్లు ఎమ్మెల్యే సండ్ర పేర్కొన్నారు. ‘అన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలుండటంతో హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నా. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. కరోనా నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలో అందరి ముందుకొస్తా’ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారు పేర్కొన్నారు.

వెంకట వీరయ్య మంత్రి హరీష్ రావు కార్యక్రమం ఉండటంతో నియోజకవర్గంలో విసుగు విరామం లేకుండా తిరిగారు . అందరిని కలిశారు వారికీ షాక్ హ్యాండ్ లు ఇచ్చారు. కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. దీంతో ఆయనకు కరోనా నిర్దారణ అయింది.

వెంకట వీరయ్య కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని తెలుసుకున్న పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు , హితులు ,సన్నిహితులు ఆయనకు ఫోన్ చేసి పరామర్శింస్తున్నారు. కొద్దిపాటి లక్షణాలేనని దీనిపై ఆందోళ చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తనకు ఫోన్ చేసిన వాళ్లకు చెబుతున్నారు.

Related posts

కరోనా వృద్ధిని అడ్డుకునేందుకు 2డీజీ ఔషధం విడుదల చేసిన కేంద్రమంత్రులు….

Drukpadam

కరోనా టీకాలతో ముప్పా …?

Drukpadam

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోము: తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌

Drukpadam

Leave a Comment