దళిత మహిళా భూమిని కాపాడండి : కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య వినతి
దళిత మహిళను వెంటబెట్టుకొని వచ్చిన గుమ్మడి నరసయ్య
విచారించి న్యాయం చేయాలనీ విజ్ఞప్తి
సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గౌతమ్
అక్రమణదారుల నుంచి తన భూమిని కాపాడలని ఓ దళిత మహిళ సోమవారం సీపీఐ ఎంఎల్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు ల తో కలిసి జిల్లా కలెక్టర్ ఫిర్యాదు అందచేసింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. పల్లిపాడు గ్రామానికి చెందిన కంకణాల రాధమ్మ గ్రామ రెవిన్యూ పరిధిలో గ్రామానికి చెందిన తన తండ్రీ బక్క పెద గోపయ్య నుంచి తనకు వారసత్వంగా వచ్చిన య1.34 లు అసైన్డ్ భూమిని గ్రామానికి అగ్రవర్ణానికి చెందిన దామా భాస్కరరావు, భద్రయ్య, శ్రీనివాసరావు, హనుమంతరావు అక్రమించుకుని చుట్టూ ఫిన్సింగ్ చేస్తున్నారని తెలిపింది. తనకు వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్ళగా బినామీగా గ్రామాకి చెందిన మరో దళిత మహిళను అడ్డు పెట్టుకొని భూమిని ఆక్రమించుకొన్నారని పేర్కొంది. సర్వే నెంబర్ 255/3/గ/2లో గల సదరు భూమికి తెలంగాణ ప్రభుత్వం ఖాతా నెంబర్ 100137 పేరతో టీ 26080140683 నెంబర్ గల పట్టాదారు పాసుపుస్తకం జారీచేసిందని, విచారించి న్వాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదు చేసిన మహిళ వెంట సిపిఐఎంఎల్ వైరా-కల్లూరు డివిజన్ కార్యదర్శి అర్జున్ రావు ఐఎఫ్ టియూ జిల్లా నాయకులు కంకణాల శ్రీనివాస్ పాల్గొన్నారు.