Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం రండి.. జగన్, చంద్రబాబు, పవన్ సహా 37 పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ!

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం రండి.. జగన్, చంద్రబాబు, పవన్ సహా 37 పార్టీల అధినేతలకు స్టాలిన్ లేఖ!
అందరం ఏకతాటిపైకి వస్తే తప్ప మతోన్మాద శక్తులపై పోరాడడం సాధ్యం కాదన్న స్టాలిన్
‘అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య’లో చేరాలని పిలుపు
బీజేపీని పక్కనపెట్టిన వైనం

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తమిళనాడు సీఎం ఎం కె స్టాలిన్ దేశంలోని 37 పార్టీలకు లేఖ రాయడం దేశరాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది .దేశంలో మతోన్మాద శక్తులు ప్రభాలకుండా ఉండాలంటే ఐక్యత అవసరం అందుకు తమమధ్య ఉన్న చిన్న చిన్న తగాదాలను పక్కన పెట్టి కలిసి రావాలని పిలుపు నిచ్చారు . మాతొనామద శక్తులు బలంగా ఉన్నాయి. అందరు ఏకతాటిపైకి వస్తే తప్ప ఈ శక్తులపై పోరాడడం సాధ్యం కాదన్నారు. ఇందుకోసం ‘అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య’లో చేరాలని కోరారు.

మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడదాం రండంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దేశంలోని 37 పార్టీలకు లేఖ రాశారు. సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయంపై విశ్వాసమున్న వారంతా ఏకతాటిపైకి వచ్చి మతోన్మాదం, మతపరమైన ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు రావాలని ఆ లేఖలో ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అందరం ఏకతాటిపైకి వస్తే తప్ప ఈ శక్తులపై పోరాడడం సాధ్యం కాదన్నారు. ఇందుకోసం ‘అఖిల భారత సామాజిక న్యాయ సమాఖ్య’లో చేరాలని కోరారు. స్టాలిన్ ప్రయత్నంకు ఇన్ని పార్టీలు స్పందిస్తాయన్నది చూడాల్సి ఉంది. ఒకపక్క కేసీఆర్ తనదైన శైలిలో బీజేపీతో పోరాడుతూనే మరోపక్క బీజేపీ కోరుకునే విధానాలపట్ల మొగ్గుచూపుతున్నారా ? అనేసందేహాలకు తావిస్తున్న నేపథ్యంలో స్టాలిన్ సమానత్వం , ఆత్మగౌరం , సామజిక న్యాయంపై పోరాటంలో కలిసి రావాలని కోరడం ఆశక్తిగా మారింది.

ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధ్యకుడు పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులకు స్టాలిన్ లేఖలు రాశారు. మొత్తంగా 37 పార్టీలకు లేఖలు రాసిన ఆయన బీజేపీని మాత్రం పక్కనపెట్టడం గమనార్హం.

Related posts

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు …ఓటు వేయని నల్లారి , చిరంజీవి !

Drukpadam

తెలంగాణ ఆడబిడ్డలారా… ధైర్యం కోల్పోకండి: వైఎస్ ష‌ర్మిల భ‌రోసా

Drukpadam

జగన్ గురించి మాట్లాడితే అంతు చూస్తానని పార్లమెంట్ హాల్లో గోరంట్ల మాధవ్ బెదిరించారు: రఘురాజు!

Drukpadam

Leave a Comment