Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కుట్రదారుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీఎల్పీ నేత భట్టి !

కుట్రదారుల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందామని సీఎల్పీ నేత భట్టి !
-అవుల పోషి గాడి భాషాతో సీఎం స్థాయిని దిగజార్చిన కేసీఆర్
-ఎవరికి పుట్టినోల్లని కాంగ్రెస్, తెలుగుదేశం ఎమ్మెల్యేలను నీ బిడ్డలంటూ ఎత్తుకున్నవ్.
-రాజ్యాంగం ప్రియాంబుల్ కూడా చదవని కెసిఆర్ సీఎం కావడం దురదృష్టకరం
-కెసిఆర్ తో ఏకీభవించి పదవులను వదులుకుంటారా??
-టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి

గ్రామ స్థాయి ఫ్యూడల్ నాయకుడి మనస్తత్వం కలిగిన అవుల పోషి గాడి భాషాతో నోరు ఉందని, ఎవడిని పడితే వాడిని అడ్డగోలుగా మాట్లాడొచ్చని రాష్ట్ర రాజకీయాలను, ప్రభుత్వాలను, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా సీఎం స్థాయిని దిగజార్చిన చంద్రశేఖర్ రావును ఎంత తొందరగా వదిలించుకుంటే రాష్ట్రానికి అంత మంచిదని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి భట్టి విక్రమార్క మాట్లాడారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గా వ్యవహరిస్తున్న కేసీఆర్ కొత్త రాజ్యాంగం రాయాలని అనడానికి సిగ్గు ఉండాలని విమర్శించారు. రాజ్యాంగం ప్రియాంబుల్ చదవని, గౌరవించని కెసిఆర్ ఈ రాష్ట్రానికి సీఎం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఎవరికో పుట్టిన బిడ్డలను ముద్దాడటానికి సిగ్గు ఉండాలని విమర్శలు చేసిన కేసీఆర్ కు అసలు సిగ్గు ఉందా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం సిగ్గుమాలిన చర్య కాదా అని నిలదీశారు. అసెంబ్లీలో తమ సంఖ్యాబలాన్ని పెంచి చూపించుకోవడానికి కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ లో గెలిచిన శాసనసభ్యులను టిఆర్ఎస్ లో చేర్చుకొన్న కెసిఆర్ ఎవరికో పుట్టిన బిడ్డలను ఎత్తుకొని తనకు పుట్టిన బిడ్డలుగా ముద్దాడటానికి సిగ్గు ఎందుకు లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన రాజ్యాంగ ఫలాలను దేశంలో ఉన్న నూటికి 90 శాతం మంది ప్రజలు పొందిన ప్రయోజనాలను చూసి ఓర్వలేని ఫ్యూడల్ శక్తులు తిరిగి రాచరిక వ్యవస్థను పునర్నిర్మాణం చేసే కుట్రలో భాగంగా కొత్త రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాయని అన్నారు. ఈ ఫ్యూడల్ శక్తులకు ప్రతినిధిగా ఉన్న కెసిఆర్ వ్యాఖ్యలను భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏకీభవిస్తారా? రాజ్యాంగం కల్పించిన పదవులకు దూరంగా ఉంటారా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశానికి ప్రామాణికమైన భారత రాజ్యాంగం ద్వారా ఏర్పడిన బ్యూరోక్రసి, జ్యుడీషియల్, లెజిస్లేచర్ వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత రాజ్యాంగం మార్చాలన్న నినాదం తీసుకొచ్చిన మేక వన్నె పులులు ముసుగు కేసీఆర్ స్టేట్ మెంటు తో తొలగి పోయిందన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, ప్రశ్నించడం, ఓటు హక్కు ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు కావాలని అనుకునే ప్రతి పౌరుడు కుట్రదారుల నుంచి రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఏకం కావాలని పిలుపునిచ్చారు.
”డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై ఉన్న గురుతరమైన పూజ్య భావం సాక్షిగా… దేశ పౌరుల హక్కులను కాపాడాలని ఆలోచన ఉన్న వ్యక్తిగా… ప్రజాస్వామ్యమే సామాన్యులకు రక్షణ అని నమ్మే వ్యక్తి గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… రాష్ట్రంలో ఉన్న మేధావులారా, ప్రజాస్వామిక వాదులారా, యువతీ యువకుల్లారా… నాటి స్వాతంత్ర సమరయోధులు అందించిన రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు భారత రాజ్యాంగ పరిరక్షణ భాగస్వాములవుదాం. కుట్రదారులను దూరంగా పెడదామని” భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

Related posts

నెల్లూరు లో హీటెక్కుతున్న రాజకీయాలు ఆనం వర్సెస్ అనిల్ యాదవ్ …

Drukpadam

పాకిస్థాన్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడిన అమెరికా!

Drukpadam

సూపర్ సిక్స్ తో టీడీపీకి 175 కు 175 సీట్లు …కుప్పం లో చంద్రబాబు …

Drukpadam

Leave a Comment