Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి!

కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి!

  • కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న కేసీఆర్
  • బడ్జెట్ అనంతరం రగిలిపోతున్న వైనం
  • రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు
  • కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి

రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో అనడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి.వివిధ రాజకీయపార్టీలు ఇప్పటికే కేసీఆర్ మాటలపై ఎదురు దాడికి దిగాయి. దళిత సంఘాలు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. బీజేపీ ఢిల్లీలో దీక్ష చేసింది. కొన్ని చోట్ల అంబెడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు . కేసీఆర్ మాటలను సమర్ధించుకునేందుకు టీఆర్ యస్ నేతలు రంగంలోకి దిగినప్పటికీ అంతగా ఉపయోగించుకోలేక పోతున్నారు . ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సొంత నియోజకవర్గ కేంద్రం గజ్వేల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు .

కొంతకాలంగా కేంద్రంపై ఆగ్రహంతో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి తదితరులు, సీఐ వరప్రసాద్ కు ఫిర్యాదుతో పాటు రాజ్యాంగం ప్రతిని కూడా అందజేశారు. తమ ఫిర్యాదు ఆధారంగా సీఎం కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి పోలీసులను కోరారు.

Related posts

సాగర్ లో టీఆర్ఎస్ అభ్యర్థినోముల భగత్ 19 281 ఓట్ల మెజార్టీ తో విజయం

Drukpadam

మ‌ధ్యాహ్నం 1.19 గంట‌ల‌కు బీఆర్ఎస్ ఆవిర్భావ ప్ర‌క‌ట‌న చేసిన కేసీఆర్‌!

Drukpadam

ఎన్నికలను నిర్వహించడానికి ఇదొక్కటే సురక్షిత మార్గం: ప్రశాంత్ కిశోర్

Drukpadam

Leave a Comment