Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని పేరు చెపితే చలి జ్వరమా బీజేపీ …చీఫ్ పాలిటిక్స్ చేయవద్దు …టీఆర్ యస్!

  • ప్రధాని పేరు చెపితే చలి జ్వరమా బీజేపీ …చీఫ్ పాలిటిక్స్ చేయవద్దు …టీఆర్ యస్
    -బీజేపీ ,టీఆర్ యస్ విమర్శల పర్వం
    -హైదరాబాదు పర్యటనకు వచ్చిన మోదీ
    -ఎయిర్ పోర్టుకు రాని సీఎం కేసీఆర్
    -జ్వరం వచ్చింటూ ప్రధాని పర్యటనకు దూరం
    -మండిపడిన బండి సంజయ్
    -ఇంత సంస్కార హీనుడివా అంటూ ఫైర్

  ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మండిపడ్డారు.

ఈ కేసీఆర్ కు ఏంపుట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ పేరుచెబితేనే చలిజ్వరం వచ్చిందా? అని ఎద్దేవా చేశారు. ప్రధాని వస్తే కూడా రాలేనంతటి కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారా? అని నిలదీశారు. జ్వరం వచ్చిందంటూ సాకులు చెప్పి తప్పించుకోవడానికి సిగ్గుండాలన్నారు.

తెలంగాణ ప్రజలంటే మోదీకి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయని, కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా తెలంగాణ ప్రజలపై మమకారంతో మోదీ ఆయనకు అపాయింట్ మెంట్ ఇచ్చేవారని బండి సంజయ్ వెల్లడించారు. అలాంటిది, ప్రధాని హైదరాబాద్ వస్తే స్వాగతించడానికి కేసీఆర్ రాకపోవడం గర్హనీయమని పేర్కొన్నారు. కేసీఆర్ ఇంత సంస్కార హీనుడా? అని ప్రశ్నించారు.

ప్రధాని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తే సీఎం వెళ్లాల్సిన అవసరంలేదు: టీఆర్ఎస్ పార్టీ

  • హైదరాబాదు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ
  • ఎయిర్ పోర్టుకు వెళ్లని సీఎం కేసీఆర్
  • మండిపడుతున్న బీజేపీ నేతలు
  • చవకబారు రాజకీయాలు చేయొద్దన్న టీఆర్ఎస్ పార్టీ
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు పర్యటనకు రాగా, ఎయిర్ పోర్టులో స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే దీనిపై బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ పార్టీ స్పష్టత నిచ్చింది.

అనారోగ్యం కారణంగానే సీఎం ఎయిర్ పోర్టుకు వెళ్లలేకపోయారని వెల్లడించింది. అయితే, ప్రధాని ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తే సీఎం వెళ్లాల్సిన అవసరంలేదని కూడా తేల్చి చెప్పింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రోటోకాల్ సైతం ఇదే చెబుతోందని వివరించింది.దీనిపై బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదని టీఆర్ఎస్ పార్టీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి ఘటనలపై చవకబారు రాజకీయాలు చేయొద్దని బీజేపీ నేతలకు హితవు పలికింది. అంతేకాదు, ప్రోటోకాల్ విధివిధానాలకు సంబంధించిన ఆధారాలను కూడా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

Related posts

షర్మిల పార్టీకి ఇందిరా శోభన్ గుడ్ బై …ఇదే బాటలో మరికొందరు !

Drukpadam

ఎమ్మెల్సీ స్థానానికి నామినేష‌న్ వేసిన వైసీపీ అభ్య‌ర్థి!

Drukpadam

మునుగోడు ఎన్నిక నేపథ్యంలో ఆశక్తిగా మారిన తెలంగాణ రాజకీయాలు…

Drukpadam

Leave a Comment