Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గోడల మీద పేరు సులువుగా చెరప గలరేమో కానీ ప్రజల మనసుల్లో చెరప లేరు…ఎమ్మెల్యే సీతక్క!

గోడల మీద పేరు సులువుగా చెరప గలరేమో కానీ ప్రజల మనసుల్లో చెరప లేరు…ఎమ్మెల్యే సీతక్క
మీకు చేతనైతే ప్రమాదాలు నివారించేందుకు ఇసుక లారీలు ఆపండి
మంచి కోసం ప్రయత్నం చేయండి.
భక్తుల కోసం తగిన జాగ్రత్తలు తీసుకోమనడం తప్పా?
కేసీఆర్ గారు మీ కార్యకర్తలకు ఇదేనా నేర్పేది

మేడారం జతరం సందర్భంగా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు . అసలే కరోనా మహమ్మారి అందువల్ల వారికీ జాగ్రత్తలు చెప్పేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క గోడలమీద రాయించారు . మాస్క్ లు ధరించాలని , శానిటైజ్ చేసుకోవాలని భౌతిక దూరం పాటించాలని రహదారి వెంట ఆమె సొంత ఖర్చులతో నినాదాలు రాయించారు. అది టీఆర్ యస్ నాయకులకు నచ్చలేదు .దీంతో ఆమె రాయించిన వాటిని తుడిపెంయించారు. దీనిని గమనించిన ఎమ్మెల్యే సీతక్క టీఆర్ యస్ నాయకులపై మండిపడ్డారు . మేడారం జాతర రహదారిలో వందలాది ఇసుక లారీలు తిరుగుతున్నాయని వాటివల్ల మేడారం కు వచ్చే భక్తులు ప్రమాదాల భారిన పడే అవకాశం ఉందని గోడలమీద ప్రజల జాగ్రత్తల కోసం రాసిన నినాదాలు చెడిపే బదులు ఇసుక లారీలను జాతర అన్ని రోజులు ఈ రహదారి గుండా తిరగకుండా ఆపి ప్రమాదాలు నివారించాలని డిమాండ్ చేశారు . నినాదాలు చెడిపేసిం నాయకులపై మండిపడ్డారు . కెసిఆర్ గారు మీరు నాయకులను తయారు చేసేది ఇలాంటి పనికిమాలిన పనుల కోసమేనా? కనీసం జాతర అయిపోయిందా కైనా ఇసుక లారీల ఆపేయాలానే సోయి లేదు ఈ టీఆర్ఎస్ నాయకులకు, మాస్కులు ధరించండి, జాగ్రత్తలు పాటించండి అని మా పేర్లతో గోడలమీద రాస్తే దురహంకారంతో వాటిని తొలగిస్తారు…
నిన్న ములుగులో ఒక యువకుడు ఇసుక లారీ ఢీ కొనీ మరణించడం జరిగింది…
దాదాపుగా కోటి మందికి పైగా వచ్చే మేడారం శ్రీ సమ్మక్క సారక్క జాతరను దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇసుక లారీలను, మరియు భారీ వాహనాలను తక్షణమే ఆపేయాలి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలి ఆమె డిమాండ్ చేశారు .

 

Related posts

ఇంతవరకు ఇలా ఏ ప్రధాని మాట్లాడలేదు: మంత్రి కేటీఆర్

Drukpadam

రాఖీరాజకీయం…చంద్రబాబు కు రాఖీకట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క!

Drukpadam

స్వంత పార్టీ పై సీనియర్ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చురకలు …

Drukpadam

Leave a Comment