Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గురుకులాలను బాలయోగి పేరు తొలగింపు …చంద్రబాబు ఫైర్

బాలయోగి పేరు తొలగించడం వైసీపీ హీన సంస్కారానికి నిదర్శనం: చంద్రబాబు!

  • గురుకులాలకు బాలయోగి పేరు తొలగించారన్న బాబు
  • అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని వ్యాఖ్యలు
  • దళితుల కోసం బాలయోగి కృషి చేశారని వెల్లడి

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలకు దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి పేరును తొలగించడంపై మండిపడ్డారు. దళితుల అభ్యున్నతి ఎంతో కృషి చేసిన బాలయోగి పేరును తొలగించడం వైసీపీ హీన సంస్కారానికి నిదర్శనం అని విమర్శించారు.

ఒకవేళ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తే, అందుకోసం బాలయోగి పేరు తొలగించాల్సిన అవసరం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్, వైఎస్సార్ ల పేరుతో ఉన్నవాటికి అంబేద్కర్ పేరు పెట్టుకోవచ్చని అన్నారు. అంబేద్కర్ పై అంత ప్రేమే ఉంటే కొత్త జిల్లాల్లో ఒక్కదానికైనా ఆయన పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

Related posts

కేసీఆర్ కు చరిత్ర విధించబోయే శిక్ష మామూలుగా ఉండదు: మురళీధర్ రావు!

Drukpadam

18 ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు వీరే!

Drukpadam

జగన్ బెయిలు రద్దయితే ఏమవుతుందో చెప్పిన సీపీఐ నారాయణ!

Drukpadam

Leave a Comment