Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సమతాస్ఫూర్తికి బీజేపీ విఘాతం: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని!

సమతాస్ఫూర్తికి బీజేపీ విఘాతం: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని!
– మోదీని శ్రీరాముడితో పోల్చడం సరైందికాదు.
– లౌకికతత్వ పరిరక్షణకు రామానుజే ప్రేరణ – గోడకు చెప్పినా.. మోదీకి చెప్పినా ఒక్కటే..
-కేసీఆర్ విమర్శలను ఆహ్వానిస్తున్నాం.. – నదుల నీళ్లను వెనక్కు తీసుకెళ్లే అధికారం కేంద్రానికి లేదు
-పోడు సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ పోరాటం – 9,10 తేదీల్లో గుండాల, టేకులపల్లి మండలాల్లో పర్యటన

రామానుజాచార్యుల సమతాస్ఫూర్తికి విఘాతం కలిగించేలా మోడీ ప్రభుత్వ పాలన ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రామానుజురు అసమానతల నిర్మూలన కోసం పాటుపడితే బీజేపీ ప్రభుత్వం ఆ అసమానతలను పెంపొందిస్తోందన్నారు. ప్రధాని హోదాలో రామానుజాచార్యుడి సహస్రాబ్ది సమారోహానికి మోదీని ఆహ్వానించడం సహేతుకమే అయినా మోడీ పాలనను శ్రీరామ రాజ్యంగా పోల్చడంలో చినజీయర్ ఔచిత్యం సరైంది కాదన్నారు. స్థానిక సుందరయ్య భవన్లో ఆదివారం ఏర్పాటు. చేసిన విలేకరుల సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. స్త్రీ స్వేచ్ఛను హరిస్తున్నందుకా? మనువాదం, మతోన్మాదాలను ప్రోత్సహిస్తున్నందుకా? కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెడుతున్నందుకా? ముస్లింలను ఈ దేశం నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తున్నందుకా? రైతులను, వ్యవసాయాన్ని నాశనం చేసే నల్లచట్టాలు తెచ్చి… పోరాట ఫలితంగా క్షమాపణ చెప్పినందుకా? ఉత్తరప్రదేశ్లో దళిత మహిళలపై దాడులు చేసినందుకా? మోడీ పాలనశ్రీరామ రాజ్యం వలే సుభిక్షంగా ఉందని చినజీయర్ విశ్లేషణ చేయడం సరైంది కాదని తమ్మినేని ఖండించారు. మోడీ పాలనలో లౌకిక ప్రజాస్వామ్య స్ఫూర్తి దెబ్బతిందని, అసమానతలు పెరిగిపోయాయని అన్నారు. సామాజిక న్యాయం ఊసేలేని రాక్షస చట్టాలు అమల్లోకి వచ్చాయని తెలిపారు. మోడీ పాలన ఈ దేశాన్ని దివాళా తీయించేలా ఉందన్నారు. కరోనా సెకండ్రోవేవ్ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిందన్నారు. “గోడకు చెప్పినా… మోడీకి చెప్పినా ఒక్కటే’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కేసీఆర్ వ్యాఖ్యలు సరైనవి కావన్నారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరిస్తోందనే కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. పోడు సమస్యలను పరిష్కరించడంలో కేసీఆర్ ద్వంద్వ వైఖరిని ఖండించారు. పోడుదారులకు పట్టాలు ఇవ్వకపోగా 2005కు ముందు స్వాధీనంలో ఉన్న భూములను లాక్కునే ప్రయత్నం చేయడం సరైంది కాదన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, టేకులపల్లి మండలాల్లో పోదురైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఈనెల 9, 10 తేదీల్లో ఆ మండలాల్లో బాధితులను కలుస్తామన్నారు. పోరు సమస్యలను పరిష్కరించకపోతే టీఆర్ఎస్, బీజేపీయేతర పక్షాలతో ఏర్పాటు చేసిన అఖిలపక్షాల ఆధ్వర్యంలో మళ్లీ పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్లో కృష్ణా, గోదావరి, కావేరి నీటి అనుసంధానం పేర్కొనడం సరైంది కాదన్నారు. బచావత్ కమిటీ సిఫారసుల మేరకు రెండు నదుల నీళ్లను వెనక్కుతీసుకెళ్లే అధికారం కేంద్రానికి లేదన్నారు. కాళేశ్వరంతోనే రాష్ట్రమొత్తం సస్యశ్యామలం కాదనే విషయాన్ని కేసీఆర్ గ్రహించాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Related posts

టీఆర్ యస్ ఎమ్మెల్యేలు బీజేపీ టచ్ లో ఉన్నారా ?

Drukpadam

లాలూ ఆగాయా …బీహార్ రాజకీయాలు మారనున్నాయా!

Drukpadam

ఆరాతీయడమే జర్నలిస్ట్ ల వృత్తి …ఆరాధించడం కాదు మంత్రి గారు ….

Drukpadam

Leave a Comment