Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నా రాజీనామాతోనే కేసీఆర్ దిగొచ్చారు: ఈటల రాజేందర్

నా రాజీనామాతోనే కేసీఆర్ దిగొచ్చారు: ఈటల రాజేందర్

  • దళితులందరికీ దళితబంధును ఇవ్వాల్సిందే
  • హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధును తీసుకొచ్చారు
  • కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది

ముఖ్యమంత్రి కేసీఆర్ కు దళితుల ఓట్ల మీదే తప్ప దళితుల మీద ప్రేమ లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే దళితబంధును తీసుకొచ్చారని.. హుజూరాబాద్ ఉపఎన్నిక ఉండకపోతే దళితబంధు ఉండేది కాదని అన్నారు.

అసలు తన రాజీనామాతోనే కేసీఆర్ దిగొచ్చారని ఎద్దేవా చేశారు. దళితులందరికీ దళితబంధు పథకం కింద రూ. 10 లక్షల చొప్పున ఇవ్వాల్సిందేనని ఈటల డిమాండ్ చేశారు. దళితబంధు డబ్బులు ప్రగతి భవన్ నుంచి ఇవ్వడం లేదని… ఇచ్చేది ప్రజల డబ్బునే అని అన్నారు.

ఊరూరా బెల్ట్ షాపులను పెట్టి ఎన్నో కుటుంబాలను రోడ్డుమీద పడేస్తున్నారని మండిపడ్డారు. తాను అమాయకుడిని కాదని, ఉద్యమ బిడ్డనని చెప్పారు. హుజూరాబాద్ ఉపఎన్నికలు అయిన మరుసటి రోజు నుంచి ఇక్కడ ఒక్క టీఆర్ఎస్ నాయకుడు కూడా కనిపించడం లేదని అన్నారు. కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెప్పారు.

Related posts

భద్రాచలం ముంపు పాపం బీజేపీదే: మంత్రి అజయ్..మంత్రి అజయ్ !

Drukpadam

అనర్హత వేటుతో పెరిగిన రాహుల్ గాంధీ గ్రాఫ్….!

Drukpadam

అసలు సుఖేష్ ఎవరు …కేసీఆర్ పై కక్షతోనే ఈనాటకమంతా …ఎమ్మెల్సీ కవిత !

Drukpadam

Leave a Comment