Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఉద్యమ కార్యాచరణ చేపడతాం :కె .రాంనారాయణ!

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఉద్యమ కార్యాచరణ చేపడతాం :కె .రాంనారాయణ!
-చెల్లుబాటు కానీ హెల్త్ కార్డులతో ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులు
-అరకొరగా అక్రిడేషన్ లు
-కరోనా బారినపడిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలి

పేరుకు ఫోర్త్ ఎస్టేట్ …. ఎమర్జన్సీ డ్యూటీ , వేతనాలు లేని ఉద్యోగం ,భద్రత లేని బతుకులు , ఇళ్లస్థలాలు కోసం వేళ్ల తరబడి ఎదురు చూపులు … చెల్లుబాటు కానీ హెల్త్ కార్డులు , అరకొరగా అక్రిడేషన్ లు స్థూలంగా చెప్పాలంటే జర్నలిస్టుల పరిస్థితి దారుణంగా ఉందని టీయూడబ్ల్యూ జె రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె .రాంనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు . అందువల్ల సమస్యల సాధనకోసం ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్లు తెలిపారు . దీనిపై రాష్ట్ర నాయకత్వం చర్చించి కార్యాచరణ ప్రకటిస్తుందని అన్నారు . హక్కుల సాధనకోసం జర్నలిస్ట్ లోకం ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు . ఇళ్లస్థలకోసం అనేక మంది జర్నలిస్టులు కళ్ళల్లో వత్తులు పెట్టుకొని చూస్తున్నారని ,తెలంగాణ ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్నా వాగ్దానం మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది విమర్శించారు . ఇటీవల మీడియా సమావేశంలో కేసీఆర్ మరోసారి జర్నలిస్టుల ప్రస్తావన తెచ్చి త్వరలోనే మీకు ఎమ్మెల్యేలాలు ఇళ్ల స్థలాల సమస్య తీరబోతుంది ప్రకటించారని అదే జరిగితే కేసీఆర్ కు తప్పకుండ కృతజ్నతలు చెబుతామని రానియెడల ప్రతి నియోజవర్గ కేంద్రంలో టెంట్లు వేసి ప్రభుత్వ వాగ్దానాల సాధనకోసం ఉద్యమిస్తామని అన్నారు. ఇందుకోసం పౌరసమాజం మద్దతు కూడా కోరతామని వెల్లడించారు. సమాజహితం కోరి ప్రజల పక్షాన నిలుస్తున్న జర్నలిస్టులకు నిలవనీడకోసం ప్రభుత్వం ఇంటి జాగా ఇచ్చేందుకు తాత్సరం చేయడం దుర్మార్గమని అన్నారు .

కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్ ప్రసేన్ మాట్లాడుతూ సమస్యల పరిష్కరంకోసమే జర్నలిస్టుల ఐక్యత అవసరం అని అన్నారు . కొంతమంది జర్నలిస్టుల మధ్య ఐక్యత లేదనే ప్రచారం చేస్తున్నారని అది మన ఉమ్మడి సమస్యల పరిష్కరానికి అడ్డంకిగా మారిందని అందరం ఒక్కటైతే ఏ సమస్య అయిన పరిస్కరించుకునే అవకాశం ఉందని అన్నారు .ఖమ్మం లో జర్నలిస్టులు అంతా టీయూడబ్ల్యూ జె( ఐ జె యూ ) సభ్యులుగా చేరాలని పిలుపు నిచ్చారు . హెల్త్ కార్డులు ఇచ్చిన చెల్లుబాటు కాక అనేక మంది జర్నలిస్టులకు వైద్యసేవలు అందక ప్రాణాలు కోల్పోయిన విషయాన్నీ ఆయన గుర్తు చేశారు. చెల్లు బాటు అయ్యే హెల్త్ కార్డులు ఇవ్వాలని అందరికి అక్రిడేషన్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు . కరోనా వల్ల మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు .

నగర కన్వీనర్ మైసా పాపారావు ఆధ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఏనుగు వెంకటేశ్వర రావు , వనం వెంకటేశ్వర్లు , మాటేటి వేణు గోపాల్ , సామినేని కృష్ణ మురహరి , భూపాల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు గోగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కార్యదర్శి ఖాదర్ బాబా జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి వేగినాటి మాధవరావు , కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్ రావు , నాయకులు,సీవీఆర్ శ్రీనివాస్ , మొహినుద్దీన్ , నలజాల వెంకట రావు , నాగేందర్ రెడ్డి , వీడియో జర్నలిస్ట్ ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శిలు ఆలశ్యం అప్పారావు , జాకీర్ , ఫోటో జర్నలిస్ట్ కమటం శ్రీనివాస్ రావు , కోశాధికారి జనార్ధన చారి , సీనియర్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు .

టీయూడబ్ల్యూ జె సభ్యత్వానికి అనూహ్య స్పందన

ఖమ్మం నగరంలో టీయూడబ్ల్యూ జె ,(ఐ జె యూ ) సభ్యత్వానికి అనూహ్య స్పందన వచ్చింది.వివిధ పత్రికలూ , ఎలక్ట్రానిక్ మీడియా కు చెందిన వివిధ చానళ్ళు కు చెందిన జర్నలిస్టులు కార్యక్రమంలో సభ్యత్వం తీసుకున్నారు . సభ్యత్వ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ ప్రసేన్ లాంఛనంగా ప్రారంభించారు. తొలుత రాష్ట్ర నాయకులు రాంనారాయణకు అందజేశారు . అనంతరం వివిధ పత్రికలు చానళ్లకు చెందిన జర్నలిస్టులకు సభ్యత్వం అందించారు . అనంతరం నగరం కమిటీ రాష్ట్ర ,జిల్లా నాయకులను సన్మానించింది.

గొప్ప మానవతావాది అన్నం శ్రీనివాసరావు ఘనసత్కారం..:

యూనియన్ సభ్యత్వ నమోదు సమావేశం సందర్భంగా కరోనా కష్టకాలంలో సామాజిక సంఘ సేవ తో పాటు జర్నలిస్టులకు సైతం గొప్ప సేవలు అందించి న అన్నం సేవా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అన్నం శ్రీనివాసరావు ను ఘనంగా జర్నలిస్టు యూనియన్ నేతలు సత్కరించి అభినందనలు తెలిపారు. అన్నం శ్రీనివాసరావు సేవలను కె రామ్ నారాయణ, ప్రసేన్, మోయినుద్ధిన్ , నగర కన్వీనర్ మైసా పాపారావు, పల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు జర్నలిస్టులు అభినందనలతో ముంచెత్తారు.

 

Related posts

టియుడబ్ల్యుజె రాష్ట్ర మహాసభలకు ఆహ్వానసంఘం ఆధ్వరంలో చురుగ్గా ఏర్పాట్లు…

Ram Narayana

గోదావరి ఉగ్రరూపం …మూడవ ప్రమాద హెచ్చరిక జారీ :భద్రాచలం లోనే మంత్రి పువ్వాడ మకాం

Drukpadam

బిపిన్ రావత్ మంచి నీళ్లు అడిగారు.. ఆయనకు నీళ్లు కూడా ఇవ్వలేకపోయాం: ప్రత్యక్ష సాక్షి కంటతడి!

Drukpadam

Leave a Comment