Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నల్లగొండ నాలుగోవ రౌండ్ ఫలితాలలో అదే వరవడి

నల్లగొండ నాలుగోవ రౌండ్ ఫలితాలలో అదే వరవడి
-పల్లా ,తీన్మార్ ,కోదండరాం
-పల్లా 4 రౌండ్లలో కలిపి మొత్తం ఓట్లు 66480 మెజార్టీ 16281
-తీన్మార్ కు 50838 ,కోదండరాం కు 42352
-బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు నాలుగు ఐదు స్తాననలలో కొనసాగుతున్నారు.
-లెఫ్ట్ అభ్యర్థి బాగా వెనకబడి ఉన్నారు.

-నాలుగోవ రౌండ్ లో

పల్లా కు 17100
తీన్మార్ కు 13500
కోదండరాం కు 11917

నల్లగొండ సెంటర్ లో జరుగుతున్నా పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అధికార పార్టీ అంచనాలు తల్ల కిందులు అయ్యాయి. మొదటి రౌండ్ లోనే తమ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి సునాయాసంగా గెలుస్తాడని టీఆర్ యస్ శ్రేణులు భావించాయి.కానీ అందుకు భిన్నంగా ఓట్లు లభించటం తో ఖంగు తింటున్నారు. మూడు జిల్లాలలో ఎక్కడ స్పష్టమైన ఆధిక్యం కనబరిచే పరిస్థితులు లేవు. ప్రభుత్వ వ్యతేరేకత ప్రజల్లో ఎంత ఉందో దీని బట్టి అర్థం అవుతుంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్ మల్లన్న ను ఆదరించటం చూస్తుంటే ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కచ్చితంగా నిలబడి దాన్ని ప్రచారం చేసుకున్నారో వారిని ప్రజలు ఆదరించారనేది అర్థం అవుతుంది. ఏ పార్టీ మద్దతు లేకుండా ,ఒంటరి పోరు చేసిన తీన్మార్ మల్లన్న ప్రజల గుండెన్లో నిలిచారనేది ఓట్ల సరళి తెలియజేస్తుంది. ఒక్కడుగు ఊరూరా తిరిగాడు. కేసీఆర్ ప్రజలకు చేస్తున్న మోసాలను వారికీ అర్థం అయ్యే భాషలో వివరించాడు. అందువల్ల ఆయన వాయిస్ ప్రజలకు అవసరం ఉందని భావించిన పట్టభద్రులు ఆయన వైపు మొగ్గుచూపారు. ఒక్క రూపాయ ఖర్చు పెట్టకుండా , ఓటర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆయన ఓట్లు తెచ్చుకోవటం గొప్ప విషయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న ఖలిస్థానీ లీడర్

Drukpadam

మారిషస్ మాజీ అధ్యక్షుడు అనిరుధ్ జగన్నాథ్ కన్నుమూత

Drukpadam

ఇప్పుడు కాకపోతే.. విశాఖ మరెప్పుడూ రాజధాని కాలేదు: ధర్మాన ప్రసాదరావు

Drukpadam

Leave a Comment