హిజాబ్ పై కర్ణాటకలో దాడులు …న్యాయవాది సాదిక్ షేక్ ఆందోళన!
ఇది మత విశ్వాసాలకు సంబందించిన అంశమని వెల్లడి
ఒకరి మత విశ్వాసాలను మరో మతం గౌరవించడం దేశ గొప్పతనమని వ్యాఖ్య
దాడులను అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం
దాడులు అరికట్టకపోతే దేశ వ్యాపిత ఆందోళనలు
ముస్లిం విద్యార్థిని లు హిజాబ్ ధరించడం పై కర్ణాటక లో జరుగుతున్న దాడులపై ఖమ్మం కు చెందిన సామాజిక కార్యకర్త న్యాయవాది సాదిక్ ఆందోళన వ్యక్తం చేశారు . మత విద్వేషాలను రెచ్చగొడుతున్న శక్తులను అరికట్టడంలో అక్కడ బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు .
ఇస్లాం ఎప్పుడూ మహిళకు సరైన గౌరవం ఇస్తుంది ఆ బోధనలు, ఖురాన్ ప్రవక్త ప్రవచనాల స్వేచ్ఛ మరియు హక్కు తోనే ఎందరో మహిళలు పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు
కర్ణాటక రాష్ట్రం, ఉడిపి లోని మహాత్మా గాంధీ మెమోరియల్ కాలేజ్, లో ముస్కాన్ అనే ముస్లిం విద్యార్థిని బురఖా ధరించి కాలేజ్ లో సర్టిఫికేట్ ల కొరకు వెళ్తుండగా కాలేజ్ అవరణలో కాషాయ కండువాలు ధరించిన యువకులు మత పూరిత నినాదాలు చేస్తూ యువతి పై దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండించారు . ఒంటరిగా ఉన్న విద్యార్థిని ముస్కాన్ ఎంతో ధైర్యంగా 100 ల సంఖ్యలో ఉన్న యువకులను ఎదిరించడం అభినందనీయమని అన్నారు . హిజాబ్ హక్కుల పై యావత్తు ప్రపంచం మరియు సామాజిక మాధ్యమాల్లో నిరసనల వెల్లువ మొదలైంది.
బేటీ -బచావో,బేటీ – పడావో..సబ్ కా సాత్-సబ్ కా వికాస్ అనే గౌరవ ప్రధాన మంత్రి మోడీ కూడా కనీసం ట్విట్టర్ వేదికగా హిజాబ్ గురించి స్పందించకపోవడం ఎంతో శోచనీయం మన్నారు .
భిన్నత్వంలో ఏకత్వం, గొప్ప లౌకికవాదం ఉన్న మన భారతదేశం లో కేవలం ముస్లిం లే కాకుండా కుల మతాలు రాజకీయాలకు అతీతంగా హిజాబ్ ఘటన కు సంఘీభావం మరియు విద్యార్థిని ల పై దాడులను ఖండించారు. సీఎం బసవరాజు బొమ్మై పూర్తి బాధ్యత వహిస్తూ వెంటనే పరిస్థితి ని అదుపు లో కి తెచ్చి శాంతి భద్రతల కు భంగం కలగకుండా చూడాలనిను డిమాండ్ చేశారు…
కర్ణాటక బీజేపీ ప్రభుత్వం అల్లరి మూకల ను అరెస్ట్ చేసి శిక్షించ కుండా మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులు గా వివక్ష చూపడం సరి కాదు, ఇలాంటి వైఖరిని ప్రభుత్వం వీడకపోతే అన్ని రాష్ట్రాల్లో నిరసనలు వెల్లు వేత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు . ఇందుకు పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహించాలని అన్నారు .
సనా ముస్కాన్ మాట్లాడుతూ హిజాబ్, నిఖాబ్, పరదా, బురఖా ల గురించి కనీస జ్ఞానం కూడా లేని వారు మతపరమైన నినాదాలతో ముస్లిం మైనారిటీ విద్యార్థిని ల పై కాషాయ కండువాలు ధరించిన యువకులు దాడి చేయడం చాలా హేయమైన నీచమైన చర్య అని ఖండించారు…కర్ణాటక రాష్ట్ర విద్యా సంస్థల్లో హిజాబ్ పై విద్యార్థిని లు హై కోర్టు ను ఆశ్రయించిన విషయాన్నీ గుర్తు చేశారు .