Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అప్ప‌ట్లో కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌పై ఎగ‌తాళి చేశారు: కేటీఆర్!

అప్ప‌ట్లో కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్య‌పై ఎగ‌తాళి చేశారు: కేటీఆర్!

  • కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం అన్నారు
  • 2001, మేలో కేసీఆర్ చెప్పారు
  • ఇప్పుడు ఆయ‌న నాయ‌క‌త్వంలోనే తెలంగాణ అభివృద్ధి

‘కేంద్రాన్ని దారికి తెస్తాం.. తెలంగాణ సాధిస్తాం’ అంటూ 2001, మేలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల గురించి ‘ఈనాడు’ దిన‌ప‌త్రిక‌ మొద‌టి పేజీలో అప్ప‌ట్లో వ‌చ్చిన వార్త‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ‘తొలుత వారు ప‌ట్టించుకోరు.. ఆ త‌ర్వాత నిన్ను చూసి న‌వ్వుతారు.. అనంత‌రం నీతో గొడ‌వప‌డతారు.. అయిన‌ప్ప‌టికీ తుది విజ‌యం నీదే’ అంటూ మ‌హాత్మా గాంధీ సూక్తుల‌ను కేటీఆర్ ఈ సంద‌ర్భంగా పోస్ట్ చేశారు.

గాంధీ చెప్పిన‌ట్లుగానే మొద‌ట కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను చాలా మంది రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు ఎగ‌తాళి చేశార‌ని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఆయ‌న నాయ‌క‌త్వంలోనే తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వంలో పోరాడ‌దామ‌ని ఇటీవ‌ల కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ప్ర‌త్య‌ర్థుల నుంచి మ‌ళ్లీ విమ‌ర్శలు వ‌స్తున్న నేప‌థ్యంలో కేటీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Related posts

రెండు పాస్‌పోర్టులు… రామచంద్రభారతిపై మరో కేసు!

Drukpadam

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత మధు ప్రమాణం!

Drukpadam

ఏపీ సీఎం జగన్ ను దుర్యోధనునితో పోల్చిన సిపిఐ నారాయణ ..

Drukpadam

Leave a Comment