ప్రత్యేక హోదా పై టీడీపీ ,వైసీపీ పరస్పర విమర్శలు!
-ప్రత్యేక హోదాను సాధించేంత వరకు పోరాటం చేస్తాం: మంత్రి బొత్స
-హోదాపై వైసీపీ కార్యాచరణ ఏంటో చెబితే మద్దతు ఇస్తాం: టీడీపీ నేత కనకమేడల
-విజయనగరంలో బొత్స సమీక్ష
-హోదా అంశంపై వ్యాఖ్యలు
-హోదా అంశం విభజన చట్టంలో ఉందని వెల్లడి
-సీఎం జగన్ కేంద్రంతో ప్రస్తావిస్తూనే ఉన్నారని వివరణ
-కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని వైసీపీపై విమర్శలు
-వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న కనకమేడల
-టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని వెల్లడి
ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విభజన చట్టంలోని అంశాలపై చర్చించేందుకు ఈ నెల 17 న ఉభయ తెలుగు రాష్ట్రాల అధికారులతో చర్చించేందుకు కేంద్ర హోం శాఖ సమావేశం వేర్పాటు చేసింది. దానికి సంబందించిన ఎజెండా ను ఖరారు చేసు కేంద్రం విడుదల చేసింది. ఎజెండాలో ప్రత్యేక హోదా అంశం కూడా ఉండటం వైసీపీ వాళ్ళు సంతోష వ్యక్తం చేయడం వార్తలు రావడంతో ఏపీ కి చెందిన బీజేపీ నేతలు కంగు తిన్నారు . వెంటనే హోం శాఖ ను సంప్రదించి ఎజెండాలో ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించారు . బీజేపీ కుట్ర పూరితంగా ఎజెండాలో ఉన్న అంశాన్ని తెలగించిందని వైసీపీ ఆరోపణలు
గుప్పించింది. దీంతో బీజేపీ ప్రత్యేక హోదా అంశం తెలంగాణకు ఏమి సంబంధం అందువల్ల అది పొరపాటున ఎజెండా లో వచ్చిందని పేర్కొన్నది దాన్ని గతించిన అధికారులు వెంటనే దాన్ని తొలగించి ఉంటారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. బీజేపీ నే కావాలని ఏపీకి అన్యాయం చేస్తుందని వైసీపీ ప్రత్యెరోపణలు చేస్తుంది. కాగా ప్రత్యేక హోదా విషయంలో జగన్ సర్కార్ కేంద్రం తో కుమ్మకైందని టీడీపీ విమర్శలు చేస్తుంది. వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే మద్దతు ఇస్తామని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల అన్నారు .
విజయనగరంలో అధికారులతో సమీక్ష సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యేకహోదా అంశంపై స్పందించారు. ప్రత్యేక హోదా అంశం అప్పటి విభజన చట్టంలో ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై సీఎం జగన్ పలు దఫాలుగా కేంద్రంతో ప్రస్తావిస్తూనే ఉన్నారని వెల్లడించారు. ప్రత్యేకహోదాపై రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఏపీకి ప్రత్యేకహోదాను సాధించేంతవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఇక, ఏపీకి మూడు రాజధానుల అంశంపైనా బొత్స అభిప్రాయాలను పంచుకున్నారు. ఎవరెన్ని చెప్పినా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం తమ విధానం అని అన్నారు. పరిపాలనా రాజధాని విశాఖకు వచ్చితీరుతుందని పేర్కొన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదాపై వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే తాము కూడా మద్దతిస్తాం :కనకమేడల
ఏపీకి ప్రత్యేకహోదాపై వైసీపీ కార్యాచరణ ప్రకటిస్తే తాము కూడా మద్దతిస్తామని టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. అజెండాలో ప్రత్యేకహోదా అంశం పెట్టకపోవడం ఏంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ సర్కారుకు కేంద్రంతో ఉన్న ఒప్పందం ఏంటో చెప్పాలని నిలదీశారు. అజెండా మారడానికి కేంద్రానికి సీఎం జగన్ రాసిన లేఖనే కారణమని భావిస్తున్నట్టు కనకమేడల తెలిపారు. వైసీపీకి 28 ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తేవడంలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ ప్రభుత్వానిది వైఫల్యమా? లొంగుబాటా? అని ప్రశ్నించారు.
అసలు, వైసీపీ తీరుపై సందేహాలు కలుగుతున్నాయని, అజెండాలో హోదా అంశం ఎవరు చెబితే తొలగించారని వ్యాఖ్యానించారు. హోదాపై మంచి పరిణామం ఎదురైతే వైసీపీకి, చెడు పరిణామం ఎదురైతే చంద్రబాబుకు ఆపాదిస్తున్నారని కనకమేడల ఆరోపించారు.
కేంద్రం హోదా ఇవ్వకపోతే వైసీపీ కార్యాచరణ ఏంటో చెప్పాలని అన్నారు. హోదాపై ఏవిధంగా ముందుకు పోదలుచుకున్నారో చెబితే, అందుకు టీడీపీ కూడా మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ పోరాడితే టీడీపీ నేతలు కూడా కలిసి వస్తారని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, వారితో పాటు తాము కూడా రాజీనామాలు చేస్తామని కనకమేడల వెల్లడించారు. ఒకవేళ, హోదా సాధించడం వైసీపీ వల్ల కాదని జగన్ చెబితే, టీడీపీ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.