Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కణాల్లోకి కరోనా చొరబడకుండా అడ్డుకునే కొత్త యాంటీబాడీ అభివృద్ధి!

కణాల్లోకి కరోనా చొరబడకుండా అడ్డుకునే కొత్త యాంటీబాడీ అభివృద్ధి

  • కరోనాపై కొనసాగుతున్న పరిశోధనలు
  • యాంటీబాడీని అభివృద్ధి చేసిన అమెరికా పరిశోధకులు
  • FuG1 గా నామకరణం
  • కాక్ టెయిల్స్ తో కలిపితే సత్ఫలితాలు!
  • మైక్రోబయాలజీ స్పెక్ట్రమ్ జర్నల్ లో వివరాలు  

కరోనా మహమ్మారిపై గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారు ఆసక్తికర పరిశోధన చేపట్టారు. సరికొత్త యాంటీబాడీని అభివృద్ధి చేశారు. మానవ కణాల్లో ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించకుండా కరోనా వైరస్ ను ఇ విజయవంతంగా అడ్డుకుంటుంది. దీనికి FuG1 గా నామకరణం చేశారు.

మానవ కణాల్లోకి చొరబడేందుకు కరోనా వైరస్ క్రిములు వినియోగించే ఫ్యురిన్ అనే ఎంజైమును ఈ కొత్త యాంటీబాడీ నాశనం చేస్తుంది. తద్వారా కరోనా వైరస్ గొలుసును తెంచేస్తుంది. ఫ్యురిన్ సాధారణంగా మానవ దేహంలో విరివిగా ఉంటుంది. ఇది ప్రొటీన్లను సైతం చిన్న ముక్కలుగా విడగొట్టగలిలే శక్తిని కలిగి ఉంటుంది. ప్రొటీన్లను ఆవరించి ఉండే పాలీబేసిక్ పెప్టైడ్ కవచాలను సైతం ఇది ఛేదిస్తుంది. అందువల్లే కరోనా క్రిములు ఈ ఫ్యురిన్ ఎంజైమును ఉపయోగించుకుని శరీరంలోని ప్రతి అవయవంలోనూ వరుసగా ఇన్ఫెక్షన్లను కలుగచేస్తాయి.

అయితే కొత్త యాంటీబాడీ ద్వారా ఫ్యురిన్ ఎంజైము కార్యకలాపాలు పూర్తిస్థాయిలో అచేతనావస్థకు తీసుకెళ్లవచ్చని అమెరికా పరిశోధకులు చెబుతున్నారు.

ఈ యాంటీబాడీ పనితీరును మైక్రోబయాలజీ స్పెక్ట్రమ్ అనే సైన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ కొత్త యాంటీబాడీ (FuG1)ని గనుక ఇప్పటికే కరోనా చికిత్సలో వినిగియోస్తున్న సార్స్ కోవ్-2 కరోనా కాక్ టెయిల్ ఔషధాలకు జోడిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన జోగేందర్ తుషీర్ సింగ్ అనే పరిశోధకుడు వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్లు ప్రజలను ఆసుపత్రి పాలవ్వకుండా కాపాడుతున్నాయని, అయితే, కరోనా వ్యాప్తిని సమర్థంగా అరికట్టడంలో వ్యాక్సిన్లు ఏమంత ప్రభావశీలత కనబర్చవని అభిప్రాయపడ్డారు. తాము అభివృద్ధి చేసిన యాంటీబాడీ ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో ఉపయోగకారి అవుతుందని పేర్కొన్నారు.

Related posts

సడన్ లాక్ డౌన్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ !

Drukpadam

కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోంది: ఐఎంఏ

Drukpadam

బ్లాక్ , ఫంగస్ ,వైట్ ఫంగస్ ఏది డేంజర్ ….

Drukpadam

Leave a Comment