Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

తిరుపతిలో సినిమా స్టూడియో పెడతా: జగన్ తో భేటీ అనంతరం  మంచు విష్ణు

తిరుపతిలో సినిమా స్టూడియో పెడతా: జగన్ తో భేటీ అనంతరం  మంచు విష్ణు
జగన్ తో చాలా విషయాల గురించి మాట్లాడాను
చర్చలకు నాన్నగారిని పిలవలేదనేది దుష్ప్రచారం
విశాఖకు సినీ పరిశ్రమ తరలింపుపై ఆలోచిస్తాం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మంచు విష్ణు భేటీ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భేటీ వివరాలను వెల్లడించారు. సీఎంతో తాను చాలా విషయాల గురించి మాట్లాడానని చెప్పారు. జగన్ తో మాట్లాడిన విషయాలు వ్యక్తిగతమైనవని అన్నారు. సినీ పరిశ్రమ సమస్యలపై కూడా చర్చించామని చెప్పారు. తిరుపతిలో తాను సినిమా స్టూడియో పెడతానని తెలిపారు. ముఖ్యమంత్రితో చర్చలకు నాన్న గారిని పిలవలేదనేది దుష్ప్రచారమని చెప్పారు. విశాఖకు సినీ పరిశ్రమను ఎలా తరలించాలనే విషయంపై ఆలోచిస్తామని తెలిపారు. సినీ పరిశ్రమకు ఏపీ, తెలంగాణలు రెండు కళ్లు అని చెప్పారు. సినీ పరిశ్రమ మొత్తం ఒకే కుటుంబమని అన్నారు.

సినీ పరిశ్రమలోని కొందరు పెద్దలు అగ్ర హీరోలు ఇటీవల సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై ఏపీ సీఎం జగన్ కలిశారు . అంతకు ముందు చిరంజీవి ఒంటారిగాను ,అంతకు ముందు నాగార్జున , చిరంజీవి ,ఇతర సినీ పెద్దలు కలిశారు . అన్ని సందర్భాలలో మోహన్ బాబు ,మంచి విష్ణు వారితో కలిసి రాలేదు .దీంతో సినీ పరిశ్రమలో ఇది ఒక చర్చ నియాంశంగా మారింది. ఇటీవల హైద్రాబాద్ బొత్స కుమారుడి వివాహానికి వెళ్లిన సినీటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మోహన్ బాబు ఆహ్వానం మేరకు బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లారు . దీనిపై పెద్ద రాద్దాంతమే జరిగింది. చిరంజీవి వాళ్ళు కలిసిన వివరాలు అందించడానికి ఆయన వెళ్లారని మీడియాలో వార్తలు వచ్చాయి. దానిపై మంత్రి నాని తీవ్రంగా స్పందించారు ..మోహన్ బాబు సైతం తనకు 20 సంత్సరాలుగా పేర్ని నాని మంచి మిత్రుడని అందువల్లనే తాను ఇంటికి ఆహ్వానించానని తెలిపారు . మంచి విష్ణు ఈ రోజు సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది . ఈ సందర్భంగా సినీ పరిశ్రమ ఏపీ కి తరలింపు , స్టూడియో లో పెట్టుకునేందుకు స్థలాల విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం . విష్ణు తాను తిరుపతిలో స్టూడియో పెడతానని అందుకు ప్రభుత్వం సహకరించాలని కోరినట్లు తెలుస్తుంది.

మా నాన్నను ప్రభుత్వం ఆహ్వానించింది.. కొందరు ఆహ్వానాన్ని నాన్నకు చేరనివ్వలేదు: మంచు విష్ణు

AP govt invited my father says Manchu Vishnu
. ఇటీవల సీఎంతో సినీ ప్రముఖులకు జరిగిన భేటీకి నాన్న గారికి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని… అయితే, ఆ ఆహ్వానం నాన్నకు చేరకుండా కొందరు అడ్డుకున్నారని చెప్పారు. వాళ్లు ఎవరో తమకు తెలుసని, సమయం వచ్చినప్పుడు చెపుతామని అన్నారు. సీఎంతో భేటీకి మోహన్ బాబు వెళ్లకపోవడంతో ఆయనకు ఆహ్వానం అందలేదనే చర్చ పెద్ద ఎత్తున సాగింది. దీనిపై విష్ణు క్లారిటీ ఇచ్చారు.

Related posts

కనిపించని పులి జక్కన్న… ఎన్టీఆర్​

Drukpadam

రెండు ఆటం బాంబులు దొరికాయనుకున్నా: రాజమౌళి

Drukpadam

“మా” కు ప్రకాష్ రాజ్ రాజీనామా ….వద్దు అంకుల్ అని వారించిన విష్ణు…

Drukpadam

Leave a Comment