Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నా పేరు స్టాలిన్… నేను కరుణానిధి బిడ్డను …స్టాలిన్

నా పేరు స్టాలిన్… నేను కరుణానిధి బిడ్డను …స్టాలిన్
-నా తండ్రి ఏంచేశాడో నేనూ అదే చేస్తా
-ప్రచారంలో వేగం పెంచిన డీఎంకే
-ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని ఉద్ఘాటన
-మేనిఫెస్టోనే తమ హీరో అని వెల్లడి
-స్టాలిన్ విమర్శలపై మండిపడ్డ పళని స్వామి
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ జోష్ పెంచారు. సభల్లో నా పేరు స్టాలిన్ … నేను కరుణానిధి బిడ్డను… నా తండ్రి ఏమి చేశాడో అదే చేస్తాను … అన్న మాట తప్పను …మా ఎన్నికల మేనిఫెస్టో నే మాకు హీరో … అన్నా డీఎంకే మేనిఫెస్టో ఒక ఫేక్ హీలన్, దాన్ని నమ్మకండి … అంటూ చేస్తున్న పంచ్ డైలాగ్ లకు మంచి స్పందన వస్తుంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్ష డీఎంకే ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. డీఎంకే చీఫ్ స్టాలిన్ ప్రచారంలో పదును పెంచారు. తిరునల్వేలిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ… “నా పేరు స్టాలిన్, కరుణానిధి కొడుకును. ఈ రాష్ట్రానికి మా నాన్న ఏంచేశాడో నేనూ అదే చేస్తా. ఏమేం హామీలు ఇస్తామో అన్నీ చేస్తాం” అని ఉద్ఘాటించారు.
“ఈ ఎన్నికల్లో డీఎంకే పార్టీకి సంబంధించినంతవరకు మా మేనిఫెస్టోనే హీరో. వాళ్ల (అన్నాడీఎంకే) మేనిఫెస్టో ఓ విలన్ లాంటిది, అదొక జోక్” అని పేర్కొన్నారు. అంతకుముందు, సీఎం పళనిస్వామి డీఎంకే అధినేత స్టాలిన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తానేదో పాక్కుంటూ వెళ్లి సీఎం పీఠం దక్కించుకున్నట్టుగా స్టాలిన్ అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. నేలపై పాకుతూ వెళ్లేందుకు నేనేమైనా బల్లినా, పామునా? అంటూ సీఎం వ్యాఖ్యానించారు.
తమిళనాడులో ఏప్రిల్ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో పార్టీలన్నీ తుపాను వేగంతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈసారి కమలహాసన్ నేతృత్వంలోని మక్కళ్ నీది మయ్యం పార్టీ కూడా అసెంబ్లీ బరిలో దిగుతుండడంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
—————————————————————————————————–
ఎన్నికల ప్రచారంలో తోసుకొచ్చిన ప్రజలు కమల్ హాసన్ కాలుకి గాయం
—————————————————————————————

సినీ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ గాయపడ్డారు. దక్షిణ కోయంబత్తూరులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా… అతని అభిమానులు ఒక్కసారిగా తోసుకొచ్చారు. తొక్కిసలాటలో వారు కమల్ మీద పడ్డారు. ఆయన కాలిని తొక్కేశారు. ఈ ఘటనలో కమల్ కాలికి గాయమైంది. అనంతరం డాక్టర్ల సూచన మేరకు ప్రచారాన్ని ఆయన ఆపేశారు. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా కమల్ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. దక్షిణ కోయంబత్తూరు స్థానం నుంచి కమల్ పోటీ చేస్తున్నారు. గత సోమవారం ఆయన నామినేషన్ వేశారు. కమల్ పార్టీ తరపున సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు.

 

Related posts

రాజస్థాన్ లో కాంగ్రెస్ పుట్టి మునగనున్నదా?…సచిన్ వర్సెస్ గేహలోట్!

Drukpadam

వివేకా హత్యపై …టీడీపీ నేత నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు!

Drukpadam

కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడి అరెస్ట్!

Drukpadam

Leave a Comment