Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భూ నిర్వాసితులకు ఎకరానికి కోటి ఇచ్చే వరకు పోరాటం ఆగదు, సిపిఐ నేత భాగం…

భూ నిర్వాసితులకు ఎకరానికి కోటి ఇచ్చే వరకు పోరాటం ఆగదు, సిపిఐ నేత భాగం…
-కలెక్టరేట్ వద్ద రైతు సంఘాల ఆందోళన
-రైతుల పంటభూములు రహదారులకు ఇచ్చి రైతుల పొట్ట కొట్టొద్దు
-తక్కువధరకే భూములు ఇవ్వాలని వత్తిడి చేయడం తగదు
-భూమికి బదులు భూమి ఇవ్వండి

ఖమ్మం టూ దేవరపల్లి పో గ్రీన్ ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణం జిల్లా భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు ఎకరానికి కోటి రూపాయలు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు , తెలంగాణ రాష్ట్ర సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావులు ప్రభుత్వాలను డిమాండ్ చేశార .

సోమవారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా అధ్యక్షులు దొండపాటి రమేష్ , బొంతు రాంబాబు , నాగేశ్వరావు అధ్యక్షతన జరిగిన భూ నిర్వాసితుల ఎకరానికి కోటి పరిహారం ఇవ్వాలని జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని ప్రసంగించారు . మూడు పంటలు పండే వ్యవసాయ భూములు ను తక్కువ ధరకు ఇవ్వాలని జిల్లా అధికారులు ఒత్తిడి చేయటం సరైంది కాదని , వ్యవసాయ భూమిని జీవించే రైతులను రోడ్డున పడవద్దని వారు హెచ్చరించారు . భూమి కింద భూమి వచ్చే విధంగా పరిహారం ఇచ్చేపోరాటం నిరంతరం కొనసాగిందని తెలిపారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపర్తి గోవిందరావు , తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ , రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి మరిదు నాగేశ్వరావు , జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూఖ్య వీరభద్రం , టిడిపి రాష్ట్ర నాయకులు కూరపాటి వెంకటేశ్వర్లు , భూ నిర్వాసితుల కమిటీ కన్వీనర్ దొబ్బల వెంగల్ రావు , నున్నసత్యనారాయణ ఉదరపు వెంకటేశ్వర్లు , ఎస్ కెమీ రాసాహెబ్ , కొల్లు శ్రీనివాసరావు , బాలస్వామి తాళ్లపల్లి కృష్ణ , పొట్ట బత్తిని సరస్వతి తదితరులు పాల్గొన్నారు .

Related posts

ప్రతిరోజూ బీర్ తాగితే బోలెడు లాభాలట..

Drukpadam

పీపుల్స్ మార్చ్ లో భట్టికి వడదెబ్బ …మంగళవారం సాయంత్రం యాత్రకు బ్రేక్ …

Drukpadam

పుతిన్ హత్యకు కుట్ర…క్రెమ్లిన్‌పై డ్రోన్ల దాడి..

Drukpadam

Leave a Comment