Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీజేపీకీ, మోడీకి యూనిఫామ్ కావాలి, కాంగ్రెస్ అన్నింటినీ గౌరవిస్తుంది-రాహుల్ వ్యాఖ్యలు…

బీజేపీకీ, మోడీకి యూనిఫామ్ కావాలి, కాంగ్రెస్ అన్నింటినీ గౌరవిస్తుంది-రాహుల్ వ్యాఖ్యలు…
-అధికార పార్టీ అహంకారానికి గుణపాఠం చెప్పాలి
-భారత్ దేశం వివిధ సంస్కృతుల సమాహారం
-అన్ని భాషలను అన్ని ప్రాంతాలను గౌరవించడం మనసంప్రదాయం

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీజేపీ నేతలు ఇప్పుడు యూనిఫారం జపం చేస్తున్నారు. అన్ని మతాలు, కులాలూ ఒకే పద్ధతులు పాటించాలని, అందరికీ ఒకే చట్టాలు ఉండాలని, సంప్రదాయాలు ఉండాలని ప్రవచనాలు పలుకుతున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల్లో తమకు అధికారమిస్తే కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. కర్నాటకలో అయితే యూనిఫారం తప్పనిసరి చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ యూనిఫారం వాదనపై మండిపడ్డారు.

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇవాళ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్ లో జరిగిన ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ, బీజేపీపై విరుచుకుపడ్డారు. అధికార పార్టీ అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, ఆధిపత్య భావనతో రాష్ట్రానికి వస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర ఆలోచనలు, భాషలు, సంస్కృతిని గౌరవిస్తుందని, అయితే దేశంలో యూనిఫారం అమలు చేయాలని బీజేపీ కోరుకుంటోందని ఆయన ఆరోపించారు. మణిపూర్ కంటే యూపీ పెద్దదని, అయితే యూపీ, మణిపూర్‌ల ప్రజలు తమకు ఒకటేనని, యూపీ, మణిపూర్‌ల భాష, వైవిధ్యం, చరిత్ర, సంస్కృతిని సమానంగా రక్షిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తమకు ద్వంద్వ ప్రమాణం లేదని ఎన్నికల ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యానించారు.

బీజేపీ, ప్రధాని మోడీ దేశమంతా ఒకే విధానాలు ప్రవేశపెట్టాలని ఆదిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. కానీ భారత దేశం విభిన్న సంస్కృతుల సమాహారమని ఆయన గుర్తుచేశారు. వాటన్నింటినీ గౌరవించకుండా ఆధిపత్య ధోరణితో మణిపూర్ లోనూ వ్యవహరించాలని చూస్తున్నరి ఆరోపించారు. ఇలాంటి శక్తుల్ని తిప్పికొట్టాలని రాహుల్ పిలుపునిచ్చారు.

Related posts

1908 నాటి హార్లీ డేవిడ్ సన్ బైక్.. వేలంలో రూ. 7.72 కోట్లు!

Drukpadam

డిసెంబర్ 1 ,5 తేదీల్లో గుజరాత్ ఎన్నికలు…

Drukpadam

గిరిజనలు తమకు నచ్చిన ప్రాంతాల్లో నివసించే హక్కు లేదా ?

Drukpadam

Leave a Comment