Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే నితీశే రాష్ట్రపతి అభ్యర్థి అవుతారు: ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్!

బీజేపీతో తెగదెంపులు చేసుకుంటే నితీశే రాష్ట్రపతి అభ్యర్థి అవుతారు: ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్
నితీశ్‌కుమార్‌తో ఇటీవల పీకే భేటీ
బీజేపీపై ఇటీవల బహిరంగంగానే విమర్శలు చేస్తున్న నితీశ్
జాతీయ రాజకీయాల్లో చర్చ

రాజకీయాల్లో ఎప్పడు ఏమి జరుగుతుందో చెప్పలేని పరిస్థితి …వారు వీరు వీరు వారౌతున్నారు . కొన్నిసందర్భాలలో ఎవరు ఎటు పోతున్నారో ? ఎందుకు పోkuతున్నారో అర్థం కానీ పరిస్థితి ….ఇప్పుడు దేశరాజకీయాలు త్వరలో జరగనున్న రాష్ట్రపతి అభ్యర్థివైపు మళ్ళాయి .నిన్నమొన్నటి వరకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా మరాఠా యోధుడు కాకలు తీరిన రాజకీయ దురంధరుడు శరద్ పవర్ అనుకున్నారు .కానీ నేడు బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు వినపడుతుంది.ఇప్పటికే నితీష్ కు బీజేపీ కి అంత సంఖ్యత లేదనే మాటలు వినిపిస్తున్నాయి. బీజేపీ కూడా ఆయన్ను వదిలించుకోవాలని చూస్తుంది అయితే రాష్ట్రపతి ఎన్నికలవరకు చూసి తరువాత పక్కన పెట్టె అవకాశాలు లేకపోలేదని రాజకీయపరిశీలకులు అభిప్రాయం. అందువల్లనే బీజేపీ తో నితీష్ తెగతెంపులు చేసుకొని వస్తే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా రాష్ట్రపతికి పెడతామని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు . ఇది శరద్ పవర్ అనుమతి తోనే అని ఉంటారని విశ్లేషకుల అభిప్రాయం .

బీజేపీతో కనుక సంబంధాలు తెంచుకుంటే కనుక బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తొలుత ఆయన బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే ఆ తర్వాత ఆయన పేరును ప్రకటించాలా? వద్దా? అన్న విషయాన్ని చర్చిస్తామని అన్నారు.

ఇదిలావుంచితే, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ ఇటీవల నితీశ్ కుమార్ తో భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశానికి ఎలాంటి ప్రాధాన్యం లేదని నితీశ్ స్పష్టం చేసినప్పటికీ, ప్రతిపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించేందుకే ఈ భేటీ జరిగినట్టు చెబుతున్నారు.

బీహార్ అసెంబ్లీకి జరిగిన గత ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ నితీశ్‌కే ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారు. అయితే, ఇటీవల నితీశ్ బీజేపీపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండడంతో బీజేపీతో ఆయనకు చెడిందన్న ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు పీకేతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరింద

Related posts

ఈఎంఐ కట్టకపోతే ఏజెంట్లు వాహనం సీజ్ చేయడం చట్టవిరుద్ధం: పాట్నా హైకోర్టు…

Drukpadam

భారత రాష్ట్రపతులు జులై 25నే ప్రమాణ స్వీకారం ఎందుకు చేస్తారంటే..!

Drukpadam

భార‌త ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజీవ్ కుమార్‌!

Drukpadam

Leave a Comment