యుద్ధ రంగంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ…
- సైనిక దుస్తుల్లో జెలెన్‌స్కీ
- రష్యా దాడులు చేసిన ప్రాంతాల్లో పర్యటన
- వైరల్‌గా మారిన ఫొటోలు
రష్యా మొదలెట్టిన యుద్ధంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఓ సైనికుడిగా మారిపోయారు. ఓ వైపు రష్యా ఫైటర్ జెట్లు ఉక్రెయిన్ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తుంటే.. సైనికుడి దుస్తులేసుకున్న జెలెన్‌స్కీ నేరుగానే రంగంలోకి దిగిపోయారు. అధ్యక్ష భవనాన్ని వీడిన జెలెన్‌స్కీ తమ దేశ సైనికులతో కలిసి యుద్ధ రంగంలోకి దూకేశారు.
రష్యా బలగాలు దాడులు చేసిన ప్రాంతాలను ఆయన సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని మీడియా సంస్థలు తీసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి. ఈ ఫొటోల్లో జెలెన్‌స్కీ ఓ ఆర్మీ సోల్జర్‌గానే కనిపిస్తున్నారు. ఓ వైపు బాంబుల వర్షంతో రష్యా విరుచుకుపడుతున్నా..ఏమాత్రం భయపడని జెలెన్‌స్కీ.. రష్యాతో దౌత్య సంబంధాలను తెంచేసుకుంటున్నట్టుగా ఇదివరకే ప్రకటించారు. తాజాగా ఆయన సైనికుడి యూనీఫాంలో నేరుగా యుద్ధ రంగంలోకి దిగిపోయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.