Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

క‌డ‌ప ఎంపీ టికెట్ ష‌ర్మిల లేక విజ‌య‌మ్మ‌కు ఇవ్వాల‌ని వివేకా కోరారు:ప్ర‌తాప్ రెడ్డి

క‌డ‌ప ఎంపీ టికెట్ ష‌ర్మిల లేక విజ‌య‌మ్మ‌కు ఇవ్వాల‌ని వివేకా కోరారు: వాంగ్మూలంలో ప్ర‌తాప్ రెడ్డి

  • వివేకా రక్తపు వాంతులతో మృతి చెందారని మనోహర్‌రెడ్డి చెప్పారు
  • బెడ్‌రూమ్‌లో దేవిరెడ్డి శంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా వున్నారు 
  • రక్తపు మరకలను శుభ్రం చేయిచార‌న్న ప్ర‌తాప్ రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచార‌ణ కొన‌సాగుతోంది. గ‌తంలో ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి పెదనాన్న వైఎస్‌ ప్రతాప్‌రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఆ విష‌యానికి సంబంధించిన స‌మాచారం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. వివేకానంద‌రెడ్డి రక్తపు వాంతులతో మృతి చెందిన‌ట్లు వైఎస్‌ మనోహర్‌రెడ్డి చెప్పారని ప్ర‌తాప్ రెడ్డి అన్నారు.

తాను వివేక రక్తపు మరకలు చూశానని, ఆ స‌మ‌యంలో బెడ్‌రూమ్‌లో దేవిరెడ్డి శంకర్‌రెడ్డితో పాటు ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ఇనయతుల్లా ఉన్నారని ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. బాత్‌రూమ్‌లో రక్తపు మరకల మధ్య మృతదేహం ఉండ‌డం చూసిన త‌ర్వాత అది గుండెపోటుతో సంభ‌వించిన మ‌ర‌ణం కాదని గ్రహించానని తెలిపారు. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు అవినాశ్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి చెప్పారని ఆయ‌న అన్నారు.

సాక్ష్యాధారాలు ఎందుకు చెరిపేస్తున్నారని సీఐ ఆ స‌మ‌యంలో ప్ర‌శ్నించార‌ని, అయినా వారు పట్టించుకోలేదని ప్ర‌తాప్ రెడ్డి అన్నారు. రక్తపు మరకలను శంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి.. పని మ‌నిషితో శుభ్రం చేయించారని అన్నారు. అప్ప‌ట్లో మృతికి ముందు ఎన్నిక‌ల్లో కడప ఎంపీ టికెట్‌ తనకు ఇవ్వకున్నా ఫ‌ర్వాలేద‌ని వివేకానంద‌రెడ్డి అన్నార‌ని ఆయ‌న వివ‌రించారు.

ఆ టికెట్‌ షర్మిల లేక‌ విజయమ్మకు ఇవ్వాలని ఆయన కోరారని ప్ర‌తాప్ రెడ్డి చెప్పారు. భాస్కర్‌రెడ్డి కుటుంబం మొదటి నుంచి కూడా వివేకానంద‌రెడ్డికి వ్యతిరేకంగా ఉండేదని సీబీఐ అధికారుల‌కు ప్ర‌తాప్ రెడ్డి వివ‌రించి చెప్పారు. కాగా, ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్ప‌టికే మ‌రికొంద‌రు సాక్షుల‌ను ప్ర‌శ్నించారు.

Related posts

యూపీలో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు… క్షేమంగా బయటపడ్డ నేత!

Drukpadam

కరోనా వ్యాక్సిన్ అంటూ కళ్లలో చుక్కలు వేసి బంగారు గొలుసు చోరీ!

Drukpadam

జార్ఖండ్‌ అడ‌వుల్లో తుపాకుల మోత…ఒక జవాన్ మృతి …మరొకరికి సీరియస్….

Ram Narayana

Leave a Comment