Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిన్న సైనిక దుస్తుల్లో …నేడు బంకర్ లో తమను ఒంటరి వాణ్ణి చేశారని నిర్వేదం!

నిన్న సైనిక దుస్తుల్లో …నేడు బంకర్ లో తమను ఒంటరి వాణ్ణి చేశారని నిర్వేదం!
-బంకర్ లోకి వెళ్లిపోయిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
-కీవ్ నగరానికి చేరుకున్న రష్యా బలగాలు
-అప్రమత్తమైన ఉక్రెయిన్ భద్రతా బలగాలు
-అధ్యక్షుడిని కాపాడుకునేందుకు ఆయనను బంకర్ లోకి పంపిన వైనం

రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నా పోరులో నిన్నటివరకు యుద్ధరంగంలో కనిపించిన ఆ దేశ అధ్యక్షుడు నేడు తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం బంకర్లో తలదాచుకోవడంతో ఆశక్తి నెలకొన్నది .నిన్నటివరకు సైన్యానికి వెన్నుదన్నుగా నేను ఉన్నానన్న అధ్యక్షుడు తన నిర్ణయం మార్చుకున్నారా? లేక సైన్యమే ఆ విధంగా చేసిందా ? . ఇప్పటికే తమని ఒంటరిని చేశారని అధ్యక్షడు జెలెన్ స్కీని ప్రకటించిన విషయం విదితమే . పైగా నాటో కూటమి రంగంలోకి దిగితే ఇది ప్రపంచ యుద్ధమే అవుతుంది. అంతే కాదు నాటో దేశాలు ఇందులో చేరకూడదు . పరోక్ష సహాయం చేసే అవకాశం ఉంది. రష్యా సూపర్ పవర్ ఉన్న దేశం ,ఉక్రెయిన్ కు యుద్ధ సామాగ్రి చాల తక్కువ ,సైన్యం తక్కువ ,దీంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థిల్లో ఉన్నారు .

ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరానికి రష్యా బలగాలు చేరుకున్నాయి. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీని బంకర్ లోకి తరలించాయని సమాచారం వెలువడుతోంది. ఆయనను కాపాడుకునేందుకు సైన్యం ఈ పని చేసినట్టు సమాచారం.

మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులపై వీరిద్దరూ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బుకారెస్ట్, రొమేనియా దేశాలకు రెండు ప్రత్యేక విమానాలను పంపుతోంది. రేపు హంగరీ రాజధాని బుడాపెస్ట్ కు ఓ విమానాన్ని పంపుతున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Related posts

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు…

Drukpadam

ఇంజిన్ పై కవర్ లేకుండా ముంబయి నుంచి భుజ్ ప్రయాణించిన విమానం!

Drukpadam

తెలంగాణలో అదనపు కలెక్టర్లకు కియా కార్లు… పరిశీలించిన సీఎం కేసీఆర్…

Drukpadam

Leave a Comment