Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

జట్టులో చోటు కోసం పోటీ తీవ్రంగా ఉంది: శ్రేయాస్ అయ్యర్

జట్టులో చోటు కోసం పోటీ తీవ్రంగా ఉంది: శ్రేయాస్ అయ్యర్

  • వీలైనన్ని అవకాశాలు సొంతం చేసుకోవడమే నా పని
  • అన్నింటిలో నాటౌట్ గా ఉండడం మంచి పనితీరు
  • బలాలపై దృష్టి పెట్టడమే నా బలమన్న శ్రేయాస్ 

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ లో శ్రేయాస్ అయ్యర్ ఆట మెరిసింది. ప్రతీ మ్యాచ్ లో అతడు అర్ధ సెంచరీ కంటే ఎక్కువే చేసి విజయంలో కీలక భూమిక పోషించాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అతడ్ని వరించింది. ఈ సందర్భంగా అయ్యర్ మీడియాతో మాట్లాడాడు.

‘‘మూడు మ్యాచ్ లలోనూ నాటౌట్ గా ఉండడం అన్నది నా వైపు నుంచి మెచ్చుకోతగిన పనితీరు. నేను ఎటువంటి అంచనాలు పెట్టుకోను. మా జట్టులో పోటీ అంటారా? చాలా తీవ్రంగా ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆస్వాదిస్తాను. ఆటను ముగించడం అంటే నాకు ఇష్టం. జట్టులో నా స్థానాన్ని పటిష్ఠం చేసుకోవడంపై నేను మాట్లాడను. పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఏ స్థానంలో వచ్చినా బ్యాట్ తో ఆడేందుకు సౌకర్యంగా ఉండాలి.

వీలైనన్ని అవకాశాలను సొంతం చేసుకోవాలన్నదే నా ఆలోచన. ఇందుకోసం నేను ప్రత్యేకంగా సాధన చేసేదేమీ లేదు. ప్రతీ ఆటగాడికి తనదైన బలం, బలహీనత ఉంటాయి. నా బలాలపై దృష్టి పెట్టడమే నా బలం’’ అని అయ్యర్ పేర్కొన్నాడు. శ్రీలంకతో మూడు టీ20 మ్యాచ్ లలో కలిపి అతడు మొత్తం 204 పరుగులు రాబట్టాడు.

Related posts

తారల తళుకుబెళుకులతో ఘనంగా ప్రారంభమైన ఐపీఎల్-16..

Drukpadam

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక!

Drukpadam

వన్డే, టీ20లకు టాటా చెప్పేయ‌నున్న విరాట్ కోహ్లీ?

Drukpadam

Leave a Comment