Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ ను చూసి “సీఎం, సీఎం” అంటూ అరిచిన అభిమానులు

ఎన్టీఆర్ ను చూసి “సీఎం, సీఎం” అంటూ అరిచిన అభిమానులు
– అసహనానికి గురైన ఎన్టీఆర్-ఇది సందర్భం కాదని వాఖ్య
-ఆగండి,ఆగండి అంటూ అభిమానులను వారించిన ఎన్టీఆర్
-హైదరాబాదులో ‘తెల్లవారితే గురువారం’ ప్రీరిలీజ్ ఈవెంట్
-నాకు దేవుడిచ్చిన కుటుంబం కీరవాణి ,జగ్గన్న ప్రసంశలు

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చిన్నకుమారుడు శ్రీసింహా కోడూరి నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మణికాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరగ్గా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే ఎన్టీఆర్ ను చూడగానే అభిమానుల్లో సంతోషం అంబరాన్నంటింది. వారు “సీఎం, సీఎం” అంటూ బిగ్గరగా నినాదాలు చేస్తూ ఉత్సాహం వెలిబుచ్చారు. తారక్ ఓవైపు కీరవాణి తనయులు శ్రీసింహా, కాలభైరవ గురించి మాట్లాడుతుండగా, అభిమానులు మాత్రం సీఎం నినాదాలతో హోరెత్తించారు.

తనకెంతో ఇష్టులైన కీరవాణి కుటుంబసభ్యుల గురించి మాట్లాడుతున్నటప్పుడు సీఎం అంటూ అభిమానులు కోలాహలం సృష్టించడం ఎన్టీఆర్ ను కాస్తంత అసహనానికి గురిచేసింది. ఆయన వెంటనే ప్రసంగం ఆపి… “ఆగండి బ్రదర్, ఆగమని చెప్తున్నాను కదా” అంటూ మందలించే ప్రయత్నం చేశారు. అప్పటికి గానీ అభిమానుల నినాదాలు సద్దుమణగలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఈ పంక్షన్ కు నేను చీఫ్ గెస్ట్ అని అంటున్నారు .నేను చీఫ్ గెస్ట్ ను కాను . 20 నన్ను సినీ ఫీల్డ్ లో ఆదరిస్తున్న అభిమానులు దేవుళ్ళు అయితే నాకు దేవుడిచ్చిన కుటుంబం కీరవాణి,జక్కన్న కుటుంబమని కష్టాలలో సుఖాలలో నాకు తోడుగా అండగా నిలిచారని కొనియాడారు. అందువల్ల తాను ఒక కుటుంబ సభ్యుడుగా వచ్చానని చెప్పారు . కార్యక్రమం లో సంగీత దర్శకుడు కీరవాణి, దర్శకుడు రాజమోళి పాల్గొన్నారు.

Related posts

జీవో నెం.2 సస్పెన్షన్ ను స్వాగతించిన రాష్ట్ర పంచాయతీ పరిషత్…

Drukpadam

అజయ్ అన్న వెంటే మేమంతా..ఖమ్మం కార్పొరేటర్లు శపథం…

Ram Narayana

సీఎం జగన్ కు సీబీఐ కోర్టు నోటీసులు…

Drukpadam

Leave a Comment