Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బీజేపీ నేత జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో న‌లుగురి కిడ్నాప్‌!

బీజేపీ నేత జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో న‌లుగురి కిడ్నాప్‌

  • ఢిల్లీ సౌత్ ఎవెన్యూలో నివాసం ఉంటున్న జితేంద‌ర్‌రెడ్డి
  • జితేంద‌ర్ రెడ్డి డ్రైవ‌ర్ స‌హా న‌లుగురి కిడ్నాప్‌
  • సౌత్ ఎవెన్యూ పోలీసుల‌కు ఫిర్యాదు, కేసు న‌మోదు చేయ‌ని పోలీసులు

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ మాజీ ఎంపీ జితేంద‌ర్ రెడ్డి ఇంటిలో ఏకంగా న‌లుగురు వ్య‌క్తులు కిడ్నాప్‌కు గుర‌య్యార‌న్న వార్త క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఘ‌ట‌న మంగ‌ళ‌వారం సాయంత్రం ఢిల్లీలోని జితేంద‌ర్ రెడ్డి నివాసంలో చోటుచేసుకుంది. కిడ్నాప్‌పై జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది ఢిల్లీలోని సౌత్ ఎవెన్యూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదుపై ఇంకా కేసు న‌మోదు చేయ‌ని పోలీసులు స‌ద‌రు ఫిర్యాదును ప‌రిశీల‌న‌లో పెట్టార‌ట‌.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. ఢిల్లీ సౌత్ ఎవెన్యూలోని నెంః105 ఇంటిలో జితేంద‌ర్ రెడ్డి నివాసం ఉంటున్నారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆ ఇంటి ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశించి జితేంద‌ర్ రెడ్డి కారు డ్రైవ‌ర్ స‌హా న‌లుగురు వ్య‌క్తులను బ‌ల‌వంతంగా లాక్కెళ్లార‌ట‌. ఈ హ‌ఠాత్ప‌రిణామం నుంచి తేరుకున్న జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది స‌మీపంలోని పోలీస్ స్టేష‌న్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌ని జితేంద‌ర్ రెడ్డి వ్య‌క్తిగ‌త సిబ్బంది పోలీసుల‌ను కోరార‌ట‌.

Related posts

మద్యం మ‌త్తులో గురుద్వారాలోకి వెళ్లారంటూ.. పంజాబ్ సీఎంపై పోలీసు కంప్లైంట్‌!

Drukpadam

వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు కొలిక్కిరాని కేసు …

Drukpadam

9/11 ఉగ్రదాడి: సౌదీకి అమెరికా క్లీన్​ చిట్​…

Drukpadam

Leave a Comment