Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: అలంపూర్ ఎమ్మెల్యే…

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు: అలంపూర్ ఎమ్మెల్యే…
ఈనెల 8 పార్టీ బలోపేతానికి వనపర్తిలో సభ
అయిజలో నిన్న రహదారి పనుల ప్రారంభోత్సవం
కేంద్రం మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వ్యాఖ్య
ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు
ఈ నెల 8న వనపర్తిలో భారీ బహిరంగ సభ

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తప్పవా? అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో నిన్న రహదారి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారని అన్నారు.

కేంద్రం మనకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందని, కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఎన్నికలను ఎదుర్కోవాలంటే పార్టీ బలోపేతం కావాల్సి ఉందని పేర్కొన్న ఆయన ఈనెల 8న వనపర్తిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి గ్రామం నుంచి ఈ సభకు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ముందస్తు ఎన్నికలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమయ్యాయి.

కేసీఆర్ గతంలో కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు . అయితే అప్పుడు బీజేపీ తో ఉన్న దోస్తీ రీత్యా ఆయన ఎత్తుగడలు పని చేశాయి.ఇప్పుడు ఆపరిస్థితి ఉండ అంటే లేదు . పైగా బీజేపీ వ్యతిరేక శక్తులను కూడా గట్టేందుకు దేశవ్యాపితంగా తిరుగుతున్నారు. దీంతో కేసీఆర్ బీజేపీకి కొరకరాని కొయ్యగా తయారు అయ్యారనే ప్రచారానికి ఊపందుకున్నది . అయితే కేసీఆర్ ఎప్పుడు ఎందుకు ఏ రాజకీయ అస్త్రాన్ని ఎంచుకుంటారో సొంత పార్టీ వాళ్ళకే అర్థం కానీ పరిస్థితి ఉంది . అందువల్ల వేగంగా మారుతున్నా రాజకీయపరిణామాల నేపథ్యంలో కేసీఆర్ పాచికలు ఎంతవరకు పనిచేస్తాయి .ప్రశాంత్ కిషోర్ ప్రయోగాలు పనిచేస్తాయా ? లేదా అనేది తెలంగాణ రాజకీయాల్లో ఆశక్తిగా మారింది.

Related posts

గాలి జనార్దన్‌రెడ్డి తాను అనుకుంటే ఒక్క రోజైనా ముఖ్యమంత్రి కాగలడట…?

Drukpadam

జైయహో తీన్మార్ మల్లన్న జైయహో…

Drukpadam

‘కాట్సా’ చట్టం నుంచి భారత్ కు మినహాయింపులు ఇవ్వలేం: అమెరికా!

Drukpadam

Leave a Comment