Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పుతిన్ ఓ మృగం.. ఆ మృగం ఆక‌లి తీర‌దు: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు!

పుతిన్ ఓ మృగం.. ఆ మృగం ఆక‌లి తీర‌దు: ఉక్రెయిన్ అధ్య‌క్షుడు!
-ఉక్రెయిన్ ఆక్ర‌మ‌ణ‌తోనే ఆగ‌రు
-ఇత‌ర దేశాల‌పైనా ప‌డ‌టం ఖాయం
-తినే కొద్ది ఆ మృగం ఇంకా కావాలంటుంది
-పుతిన్‌పై జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఉక్రెయిన్‌పై దండెత్తి వ‌చ్చిన ర‌ష్యా భీక‌రంగా దాడులు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే యుద్దం మొద‌లై 13 రోజులు అయినా… ర‌ష్యా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా సోమవారం రాత్రి నుంచి ఉక్రెయిన్‌పైకి త‌న అమ్ముల పొదిలోని 500 కేజీల బాంబుల‌ను ర‌ష్యా ప్ర‌యోగిస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో అస‌లు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ ల‌క్ష్యం ఏమిటో? అస‌లు పుతిన్ ఎలాంటి వారో? ర‌ష్యా అస‌లు టార్గెట్ ఏమిటో? అన్న విష‌యాల‌పై ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

పుతిన్‌ను ఓ మృగంగా అభివ‌ర్ణించిన జెలెన్ స్కీ.. ఉక్రెయిన్‌ను ఆక్ర‌మించ‌డంతోనే పుతిన్ ఆక‌లి తీర‌ద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యా దండ‌యాత్ర ఉక్రెయిన్‌తో ఆగ‌ద‌ని, ఇత‌ర దేశాల‌పై కూడా ప్ర‌భావం చూపుతుంద‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పుతిన్ ఓ మృగం లాంటివారు. ఆయ‌న ఎప్ప‌టికీ సంతృప్తి చెందరు. తినేకొద్దీ ఇంకా కావాలంటూ ఆ మృగం మిగిలిన దేశాలపై కూడా ప‌డుతుంది అని జెలెన్ స్కీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇది కీవ్ నగరం అంటే ఎవరూ గుర్తుపట్టలేరు: జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ ఓ అమెరికా టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రష్యా దాడుల్లో ఉక్రెయిన్ నగరాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆక్రోశించారు. రాజధాని కీవ్ నగరం గుర్తుపట్టలేనంతగా నాశనం అయిందని తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. రాజధాని నగరాన్ని ఇప్పుడు చూసిన వారు ఇది కీవ్ అంటే నమ్మలేరని తెలిపారు. రష్యా కేవలం రాజధాని కీవ్ పై మాత్రమే కాకుండా, శివారు ప్రాంతాల్లోనూ, జనావాస ప్రాంతాలపైనా బాంబులు వేస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు.

రష్యా దళాలు తమ నగరాలను ఆక్రమించుకున్నప్పటికీ ఉక్రెయిన్ ప్రజలు ఎదురొడ్డి పోరాడుతున్నారని, అయితే ఇది ఎంతకాలం కొనసాగుతుందన్నది ప్రశ్నార్థకం అని అన్నారు. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వాలని జెలెన్ స్కీ మరోసారి విజ్ఞప్తి చేశారు. రష్యా తన ఫైటర్ జెట్లు, పోరాట హెలికాప్టర్ లను ఉక్రెయిన్ గగనతలం నుంచి దాడులు చేయకుండా నిషేధించాలని, నో ఫ్లై జోన్ ప్రకటించడంపై పాశ్చాత్య దేశాలు మరోసారి ఆలోచించాలని కోరారు.

Related posts

ఏపీలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ… వీటికి మాత్రమే మినహాయింపు!

Drukpadam

పాక్‌లో హైడ్రామా!.. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ మ‌రోమారు వాయిదా!

Drukpadam

గౌత‌మ్‌రెడ్డిని నేనే రాజ‌కీయాల్లోకి తీసు కొచ్చా: సీఎం జ‌గ‌న్

Drukpadam

Leave a Comment