Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పంజాబ్ లెక్కింపు పూర్తి.. ఆప్‌కు 92 సీట్లు!

పంజాబ్ లెక్కింపు పూర్తి.. ఆప్‌కు 92 సీట్లు!

  • 18 సీట్ల‌తో కాంగ్రెస్ డీలా
  • బీజేపీకి రెండంటే రెండు సీట్లే
  • శిరోమ‌ణి అకాలీద‌ళ్‌కు 4 స్థానాలు 
  • మ్యాజిక్ ఫిగ‌ర్ 59 సీట్లు

అంద‌రికీ ఆస‌క్తి రేకెత్తించిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. గురువారం మొద‌లైన ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యంలోనే కొన‌సాగుతూ వ‌చ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) త‌న హవాను కొన‌సాగిస్తూనే వ‌చ్చింది. గురువారం సాయంత్రానికి ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. అంద‌రూ ఊహించిన దానికంటే కాస్తంత అద‌నంగానే ఆప్‌కు 92 సీట్లు ద‌క్కాయి. ఇక ఆ రాష్ట్రంలో మొన్న‌టిదాకా అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 18 సీట్లు మాత్ర‌మే ద‌క్కాయి. మొత్తం 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో శిరోమ‌ణి అకాలీద‌ళ్‌కు 4 సీట్ల‌లో విజ‌యం ద‌క్కింది.

ఇదిలా ఉంటే… పంజాబ్‌తో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో స‌త్తా చాటిన బీజేపీ పంజాబ్‌లో మాత్రం చ‌తికిల‌బ‌డిపోయింది. 117 సీట్ల‌లో పోటీ చేసిన బీజేపీ కేవ‌లం రెండు సీట్ల‌లోనే విజ‌యం సాధించింది. మ‌రో సీటును స్వ‌తంత్ర అభ్య‌ర్థి గెలుచుకున్నారు. మొత్తంగా 59 సీట్లొస్తే ద‌క్కే పంజాబ్ సీఎం సీటును ఆప్ ఏకంగా 92 సీట్ల‌తో గ‌ట్టిగానే ప‌ట్టేసింద‌న్న మాట‌.

Related posts

రాష్ట్రంలో కొన్ని వారాలైనా లాక్ డౌన్ పెట్టాలి…సీఎల్పీ నేత భట్టి

Drukpadam

విజ‌య‌శాంతి, స్వామిగౌడ్‌తో క‌లిసి దీక్ష‌కు దిగిన బండి సంజ‌య్‌!

Drukpadam

టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్…

Drukpadam

Leave a Comment