ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి!
- కరీమున్నిసా మరణంతో ఎమ్మెల్సీ సీటు ఖాళీ
- వైసీసీ అభ్యర్థిగా కరీమున్నిసా కుమారుడు రుహుల్లా
- విజయం లాంఛనమే
ఏపీలో ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక కోసం ప్రక్రియ మొదలైపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన మహ్మద్ కరీమున్నిసా హఠాన్మరణం చెందారు. ఆమె మరణంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఇటీవలే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కాగా..వైసీపీ అభ్యర్థిగా కరీమున్నిసా కుమారుడు రుహుల్లా వైసీపీ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు గురువారం నాడు పార్టీ కీలక నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌లు వెంట రాగా.. అమరావతిలోని శాసనసభ సెక్రటేరియట్‌లో రిటర్నింగ్ అధికాకి సుబ్బారెడ్డికి రుహుల్లా తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఇదిలా ఉంటే..శాసన సభలో పార్టీల బలాబలాలు చూసుకుంటే.. రుహుల్లా విజయం ఖాయమేనని చెప్పాలి.