Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నా కుమారుడు రాఘవపై కుట్రలు పన్నారు …ఎమ్మెల్యే వనమా సంచలన ఆరోపణలు!

నేను లేని సమయంలో నా కుమారుడు రాఘవ పై కుట్రలు పన్నారు…వనమా సంచలన ఆరోపణలు!
-సొంతపార్టీ వారు ఇతర పార్టీలతో కుమ్మక్కు అయ్యారు
-నా కుమారుడి రాజకీయ జీవితం పై మచ్చ తెచ్చారు
-పార్టీ జిల్లా అధ్యక్షుడు కావాల్సినవాడి భవిష్యత్తును నాశనం చేశారు
-కుట్రలు చేసిన వారి బండారం బయటపెడతానన్న వనమా

ఖమ్మం జిల్లా పాల్వంచలో ఆమధ్య నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తెలంగాణలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ 61 రోజులు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఘటనపై వనమా వెంకటేశ్వరరావు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు అసెంబ్లీ లాబీలో ఆయన మాట్లాడుతూ, రెండు నెలల పాటు తాను అనారోగ్యంతో బాధ పడ్డానని… నేను లేని ఆ సమయంలో తన కుమారుడు రాఘవపై కుట్రలు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కావాల్సిన తన కుమారుడి భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. తాను ఆరోగ్యంతో ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. తన కుమారుడిపై కుట్రలు చేసిన వారి బండారాన్ని బట్టబయలు చేస్తానని చెప్పారు. ఈ వ్యవహారంలో టీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర పార్టీల వారు కూడా కుమ్మక్కయ్యారని అన్నారు.

ఇది ఎవరు చేశారో తనకు తెలుసునని అందరి బండారం బయట పెడతానని హెచ్చరించారు . ప్రతిపక్ష పార్టీలతో కుమ్మక్కైన కొందరు కావాలని కుట్రలో ఇరికించి ప్రజల్లో ఉంటూ ప్రజలకోసం పని చేస్తున్న తన కుమారుడిని ఎదుర్కోలేక తప్పుడు కేసులు పెట్టి ఇరికించారని ఆరోపించారు . త్వరలోనే అన్ని విషయాలు బయట పెడతానని వనమా పేర్కొన్నారు .

Related posts

హైద్రాబాద్ మెట్రో లో బాంబు కలకలం…

Drukpadam

అదానీ కేసులో మీడియాను కట్టడి చేయడానికి నో చెప్పిన సుప్రీంకోర్టు!

Drukpadam

సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ నారాయణ సూచన…

Ram Narayana

Leave a Comment