Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఇవాళ రెండేళ్ల గరిష్ఠానికి కొత్త కేసులు!

చైనాలో మళ్లీ కరోనా విజృంభణ.. ఇవాళ రెండేళ్ల గరిష్ఠానికి కొత్త కేసులు!

  • ఇవాళ ఒక్కరోజే 3,394 మందికి పాజిటివ్
  • నిన్నటితో పోలిస్తే రెట్టింపైన కరోనా కేసులు
  • పలు సిటీల్లో లాక్ డౌన్ లు ప్రకటించిన ప్రభుత్వం
  • షాంఘై సిటీలో స్కూళ్లన్నింటికీ సెలవు
  • జిలిన్ మేయర్, చాంగ్చున్ ఆరోగ్యాధికారి తొలగింపు

చైనాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కోరలు చాచి మళ్లీ ఆనాటి పరిస్థితులను తెస్తోంది. ఇవాళ తాజాగా రెండేళ్లలోనే అత్యధిక రోజువారీ కేసులు నమోదైనట్టు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. తాజాగా 3,393 మంది కరోనా బారిన పడ్డారని పేర్కొంది. అంతకుముందు రోజుతో పోలిస్తే కేసులు రెట్టింపయ్యాయని తెలిపింది. 19 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ తో పాటు డెల్టా కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ ప్రభావంతో షాంఘైలోని స్కూళ్లన్నింటినీ అధికారులు మూసేశారు. ఈశాన్య చైనాలోని చాలా నగరాల్లో లాక్ డౌన్ ను విధించారు. జిలిన్ సిటీలో పాక్షిక లాక్ డౌన్ ను విధించడంతో వేలాది మంది ఇళ్లకే పరిమితమయ్యారని ఓ అధికారి చెప్పారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, లక్షణాల్లేని వాళ్లే ఎక్కువగా ఉండడంతో గుర్తించడం కష్టమవుతోందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. జిలిన్ సిటీలో ప్రతి ఒక్కరికీ ఆరు రౌండ్ల టెస్టింగ్ పూర్తయిందని చెప్పారు. ఆ ఒక్క సిటీలోనే 500 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.

90 లక్షల మంది జనాభా ఉన్న చాంగ్చున్ అనే పారిశ్రామిక నగరాన్ని శుక్రవారమే లాక్ డౌన్ చేశారు. జిలిన్ లోని సిపింగ్, దున్హువా అనే చిన్న సిటీల్లో గురు, శుక్రవారాలు లాక్ డౌన్ విధించారు. రష్యా, ఉత్తరకొరియా సరిహద్దుల్లో ఉన్న హుంచున్ సిటీలోనూ లాక్ డౌన్ పెట్టారు. కరోనా రోగుల చికిత్సార్థం ఆ సిటీలో మూడు తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం వైద్యారోగ్యానికి సంబంధించినంత వరకు మౌలిక వసతుల లేమి వేధిస్తోందని, చాలా మందిని ఆసుపత్రుల్లో చేర్చడమూ కష్టతరంగా మారిందని అధికారులు చెప్పారు. జిలిన్ మేయర్, చాంగ్చున్ హెల్త్ కమిషన్ అధిపతులను శనివారం ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది.

Related posts

కరోనా నేపథ్యం లో పెద్ద ఎత్తున డాక్టర్లను నియమించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం

Drukpadam

ఆక్సిజన్ అవసరాలపై జాతీయ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు

Drukpadam

తెలంగాణలో కంట్రోల్‌లోనే క‌రోనా-హెల్త్ డైరెక్టర్ జీ శ్రీనివాస్ రావు…

Drukpadam

Leave a Comment