Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సిటీ బ‌స్సులో ఫుట్‌బోర్డు ప్ర‌యాణం చేసిన ఎమ్మెల్యే!

సిటీ బ‌స్సులో ఫుట్‌బోర్డు ప్ర‌యాణం చేసిన ఎమ్మెల్యే!

  • త‌మిళ‌నాడులోని తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్
  • పూండి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రాజేంద్ర‌న్
  • బ‌స్సు నిండిపోవ‌డంతో ఫుట్‌బోర్డుపైనే నిల‌బ‌డి వెళ్లిన వైనం

బ‌స్సులో ఫుట్‌బోర్డు ప్ర‌యాణం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, తోటి ప్ర‌యాణికుల‌కు ఇబ్బందిక‌ర‌మ‌ని చెబుతారు. అయితే, బ‌స్సు మొత్తం ప్రయాణికుల‌తో నిండిపోవ‌డం, చాలినంత బ‌స్సులు ఉండ‌క‌పోవ‌డంతో చాలా మందికి ఫుట్‌బోర్డు ప్ర‌యాణం త‌ప్ప‌ట్లేదు. ఇటువంటి అనుభ‌వ‌మే త‌మిళ‌నాడులోని తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ కు కూడా ఎదురైంది.

ఆయ‌న‌ సిటీ బస్సు ఫుట్‌బోర్డుపై ప్రయాణించడం అంద‌రినీ ఆశ్చర్యానికి గురి చేసింది. పూండి వద్ద పేద యువతులకు బంగారం ఇచ్చే కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. అనంత‌రం అక్కడి నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల‌నుకున్నారు. కాలినడకనే ఆయ‌న వెళ్తుండ‌గా అక్క‌డి బస్‌స్టాప్‌ వద్దనున్న విద్యార్థులు ఆయన వ‌ద్ద‌కు వ‌చ్చారు.

తాము రద్దీ అధికంగా ఉండే సిటీ బస్సులోనే వెళుతున్నామని చెప్పారు. అదనపు బస్సులు వేయించాల‌ని కోరారు. ఆ స‌మ‌యంలో అక్కడికి పూండి నుంచి బయల్దేరాల్సిన సిటీ బస్సు వ‌చ్చింది. దీంతో వెంట‌నే  విద్యార్థులందరూ ఆ బ‌స్సు ఎక్కారు. వారితో పాటు ఎమ్మెల్యే రాజేంద్రన్‌ కూడా ఆ బస్సు ఎక్కారు. బ‌స్సు నిండిపోయి ఉండ‌డంతో ఆయన కూడా పుట్‌బోర్డుపైనే నిల‌బ‌డి, ప్రయాణించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకోవాల్సి వ‌చ్చింది.

Related posts

భారత్ బంద్ నేపథ్యంలో.. హైవేలపై ట్రాఫిక్ జామ్ లు…

Drukpadam

కొత్తగూడెం ఎమ్మెల్యే కొడుకు మహిళల మానప్రాణాలు తీసి స్వేచ్ఛగా బయట తిరుగుతున్నడు: ష‌ర్మిల‌

Drukpadam

కన్ఫ్యూజన్ లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!

Drukpadam

Leave a Comment