Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం… ప్రక్షాళన చేయాలన్న అసమ్మతి నేతలు?

ముగిసిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం… ప్రక్షాళన చేయాలన్న అసమ్మతి నేతలు?
-రాహుల్ గాంధీ పూర్తీ భాద్యతలు స్వీకరించాలని డిమాండ్
-సోనియా అధ్యక్షతన సీడబ్ల్యూసీ భేటీ
-హాజరైన పార్టీ సీనియర్లు…జి -23 నేతలు
-ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ఇన్చార్జిలు హాజరు
-పార్టీ భవితవ్యంపై చర్చ!

కాంగ్రెస్ పార్టీ అత్యన్నత స్థాయి వేదిక ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సమావేశం కొద్దీ సేపటి క్రితం ముగిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు .గాంధీ కుటుంబం రాజీనామా చేస్తున్నారని జరుగుతున్నా ప్రచారాన్ని పార్టీ స్పోక్స్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఖండించారు . ఇది బీజేపీ చేస్తున్న ప్రచారంలో భాగమని అన్నారు . పార్టీ లో సంస్థాగతంగా తీసుకోవాల్సిన చర్యలపై నేతలు గళమెత్తారు . సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తోపాటు , రాహుల్ గాంధీ , ప్రియాంక ,గులాంనబీ ఆజాద్ , కపిల్ సిబాల్ ,శశిథరూర్ రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులు , ఐదు రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు , ఇతర ప్రముఖు నాయకులూ పాల్గొన్నారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీకి మరోసారి దిమ్మదిరిగిపోయింది. ముఖ్యంగా అధికారంలో ఉన్న పంజాబ్ లో ఘోర పరాజయం కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి మింగుడుపడడంలేదు. ఈ నేపథ్యంలో ఆత్మపరిశీలన కోసం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో వాడి వేడి చర్చ జరిగింది . కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన సుదీర్ఘ సమయం పాటు జరిగిన ఈ భేటీ కొద్దిసేపటి కిందట ముగిసింది. పార్టీ ప్రక్షాళన జరగాల్సిందేనని అసమ్మతినేతలు తమ గళం వినిపించారు .

ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, కాంగ్రెస్ పార్టీ భవితవ్యంపై చర్చించారు. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, ఇన్చార్జిలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్లు, జీ-23 అసమ్మతి గ్రూపు నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఈ భేటీకి హాజరయ్యారు. కాగా, కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేయాలని జీ-23 అసమ్మతి నేతలు సోనియా గాంధీకి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

Related posts

నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవం..

Drukpadam

ఇతర రాజకీయ పార్టీలను బలహీన పరిచి తాము బలోపేతం కావడమే బీజేపీ లక్ష్యమన్న ఎంపీ అరవింద్ !

Drukpadam

అక్కాచెల్లెమ్మలను గత టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది : జగన్

Drukpadam

Leave a Comment