Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైయస్ కుటుంబంలో చిచ్చు …జగన్ పై బ్రదర్ అనిల్ విమర్శల దాడి!

వైయస్ కుటుంబంలో చిచ్చు …జగన్ పై బ్రదర్ అనిల్ విమర్శల దాడి!
-బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తుందంటున్న బ్రదర్ అనిల్ కుమార్
-ఉత్తరాంధ్రలో బ్రదర్ అనిల్ పర్యటన
-విశాఖలో వివిధ వర్గాలతో భేటీ
-పలు వర్గాలకు న్యాయం జరగలేదని వెల్లడి
-సాయం కోసం చూస్తున్నారని వివరణ
-జగన్ ను కలిసి రెండున్నరేళ్లయిందన్న అనిల్ 

 

నిన్నమొన్నటివరకు గుణబాణంగా ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో రాజకీయ చిచ్చు రేగుతుందా అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు .వైయస్ రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి షర్మిల అన్నతో విభేదించి తెలంగాణాలో రాజన్న రాజ్యం తెస్తానని పార్టీ పెట్టారు . అందుకు వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. ఖమ్మం సభలో ఆమె పాల్గొని తెలంగాణ లో రాజన్న రాజ్యం కోసం తన బిడ్డని దీవించండని ప్రజలను కోరారు .ఒకపక్క వైసీపీ కి గౌరవ అధ్యక్షురాలి హోదాలో ఉన్న విజయమ్మ మరో పార్టీ సభలో పాల్గొనటమే విడ్డురంగా ఉంటె తన బిడ్డని దీవించమని కోరడం పై అప్పట్లోనే రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది. తెలంగాణ లో పార్టీ పెట్ట వద్దని అన్న జగన్ చెల్లెలుకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు . కానీ అన్నమాట లెక్క చేయలేదు .దీంతో తెలంగాణ లో షర్మిల పెట్టె పార్టీతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని అప్పట్లోనే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి ప్రకటించారు . దీంతో ఆమె తెలంగాణ లో పార్టీ పెట్టి తన తంటాలు తాను పడుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అన్న పాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ పై వారి కన్ను పడింది. జగన్ పై ఉన్న కోపమో ,లేక ఆంధ్రా ప్రజలపై ఉన్న ప్రేమో మరేదైనా రాజకీయమో తెలియదు కానీ క్రైస్తవ మతబోథకుడు బ్రదర్ అనిల్ కుమార్ నేడు ఉత్తరాంధ్రలో పర్యటించడం ,బిసి వ్యక్తి సీఎం కావాలని కోరడం సంచలంగా మారింది. కొద్దిరోజుల క్రితం బ్రదర్ అనిల్ ప్రముఖ రాజకీయ నేత మాజీ ఎంపీ ఉండవల్లికి రాజమండ్రి లో కలిశారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటన చేయడం ఆశక్తిగా మారింది. ఇందులో జగన్ ను అస్థిరపరచాలనే ఆలోచన ఉందా అనే సందేహాలు ఉన్నాయి. మరో వైపు జగన్ తో వారికీ అవగాహనా ఉండవచ్చునని అనే వారు లేకపోలేదు . ఒక పక్క ప్రతిపక్షాలతో రోజు యుద్ధం చేస్తున్న జగన్ కు సొంత ఇంట్లో కుంపట్ల ఉంటె కొత్త చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం .

జగన్ అధికారంలోకి రావడంలో తల్లి విజయమ్మ ,చెల్లి షర్మిల ప్రముఖ పాత్ర పోషించారు. అధికారంలోకి వచ్చిన తరువాత మొదట్లో ఒకసారి తప్ప వారు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి దూరమైయ్యారు . చాలాకాలం బెంగుళూర్ లో ఉన్న చెల్లలు షర్మిల
తెలంగాణ లో పార్టీ పెట్టారు . అన్నతో సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో తల్లితో కలిసి ఆమె వ్యూహాలకు పదును పెడుతున్నారు .

సోమవారం ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన న్యాయం జరగడంలేదని అన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ విజయం కోసం కృషి చేసిన సంఘాలు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. వాళ్ల గోడు వినేందుకే ఉత్తరాంధ్ర వచ్చానని తెలిపారు. దీనిపైన సీఎం జగన్ కు లేఖ రాస్తానని చెప్పారు.

పార్టీ పెట్టాలంటూ అన్ని సంఘాల వారు తనను కోరుతున్నారని, పార్టీ పెట్టడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. అది చాలా క్లిష్టమైన విషయం అని, దీనిపై సుదీర్ఘంగా ఆలోచించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

తన పరిశీలనలో ప్రధానంగా బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తోందని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. దీన్ని కచ్చితంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. సీఎం జగన్ ను కలిసి రెండున్నరేళ్లయిందని, ఆయన అపాయింట్ మెంట్ కోరడంలేదని వివరింంచారు. బ్రదర్ అనిల్ ఇటీవల విజయవాడలోనూ ఇదే తరహాలో వివిధ సంఘాలతో సమావేశం కావడం తెలిసిందే.

Related posts

రాఘురామ వ్యాఖ్యల వెనక చంద్రబాబు : అంబటి…

Drukpadam

బెంగాల్ టైగర్ తిరిగి భవానీపురా నుంచే పోటీ…

Drukpadam

నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం..

Drukpadam

Leave a Comment