Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తమిళనాడులో కొత్త ప్రయోగం.. అందరికి ఆరోగ్యం బిల్లుకు కసరత్తు!

తమిళనాడులో కొత్త ప్రయోగం.. అందరికి ఆరోగ్యం బిల్లుకు కసరత్తు!
-ఇది విప్లవాత్మకం అంటున్న నిపుణులు
-పాశ్చాత్య దేశాల్లో మాదిరిగా ‘రైట్ టు హెల్త్’!
-ప్రజలకు ఉచితంగా అన్ని రకాల ఆరోగ్య, వైద్య సేవలు
-బిల్లు తీసుకొచ్చేందుకు సర్కారు కసరత్తు
-నిపుణులతో ముఖ్యమంత్రి స్టాలిన్ చర్చలు

ఆరోగ్య హక్కును ప్రజలకు ఇచ్చే దిశగా స్టాలిన్ సర్కారు అడుగులు వేస్తోంది. ఇందుకోసం రైట్ టు హెల్త్ బిల్లును రూపొందిస్తోంది. అందరికీ సార్వత్రిక హెల్త్ కవరేజీని ఆఫర్ చేయడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా ఉంది. ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ , ప్రజారోగ్యం నిపుణులు, ఉన్నతాధికారులతో సీఎం గత వారం ఒక సమావేశం కూడా నిర్వహించారు. ఇదే జరిగితే దేశంలోనే అందరికి అందించే మొదటి రాష్ట్రంగా తమిళనాడు నిలుస్తుంది.

అన్ని వయసుల వారు, అనారోగ్య సమస్యలున్నవారు, మానసిక వైకల్య బాధితులకూ ఈ బిల్లు కింద ఉచిత ఆరోగ్య సేవలు అందించనున్నారు. ఇవి చిన్న అడుగులే అయినా, ఈ విషయంలో తమిళనాడు ముందుంటుందని రాష్ట్ర హెల్త్ సెక్రటరీ జే రాధాకృష్ణన్ తెలిపారు. ఈ బిల్లు ప్రజలు అందరి ఆకాంక్షలకు తగ్గట్టు ఉంటుందన్నారు. ఈ బిల్లు వస్తే ప్రజలకు వైద్యాన్ని తిరస్కరించడం కుదరదని అధికారులు చెబుతున్నారు.

ఈ బిల్లును వచ్చే శాసనసభ సమావేశాల నాటికి తీసుకువచ్చే అవకాశాలున్నాయని అధికారుల్లో ఒక వర్గం భావిస్తోంది. అయితే బిల్లు అమలు అంత సులభం కాదని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ‘‘రైట్ టు హెల్త్ 79 దేశాల్లో ఉంది. ఆయా దేశాల్లో ఇది ఎలా పనిచేస్తుందో చూడాలి. అరుదైన వ్యాధుల విషయంలో ఎలా వ్యవహరించాలి? రైటు టు హెల్త్ అమలుకు సిబ్బంది అవసరం ఏ మేరకు అవసరం? అన్నవి చూడాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.

1990 నుంచి థాయిలాండ్ లో ప్రజలకు యూనివర్సల్ హెల్త్ కేర్ అందిస్తుండగా, అటువంటి నమూనాను తమిళనాడులోనూ అమలు చేయాలని భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ హక్కు అమలుకు ముందుగా తగినన్ని మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

Related posts

మత విశ్వాసాలను పాటించాల్సింది విద్యా సంస్థల్లో కాదు..: తస్లీమా నస్రీన్

Drukpadam

బీజేపీ, జనసేన పొత్తు సంకేతాలు బలంగా వినిపించాలి: పార్టీ నేతలకు పురందేశ్వరి సూచన

Ram Narayana

పోలవరం వయా భద్రాచలం …నారా లోకేష్ పర్యటన…

Drukpadam

Leave a Comment