Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యుద్ధ ప్రభావం … భగ్గుమన్న డీజిల్ ధరలు లీటర్ పై రూ.25 పెంపు…

యుద్ధ ప్రభావం … భగ్గుమన్న డీజిల్ ధరలు!
-అంతర్జాతీయ విపణిలో భగ్గుమంటున్న చమురు ధరలు… భారత్ లో డీజిల్ పై రూ.25 పెంపు
-ఉక్రెయిన్ పై రష్యా దాడులు
-40 శాతం పెరిగిన ముడిచమురు ధరలు
-140 డాలర్లకు చేరిన ఒక బ్యారెల్ క్రూడాయిల్
-భారత్ లో డీజిల్ పై టోకు ధర పెంచిన చమురు సంస్థలు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం భారత్ పైనా పడింది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటుండడంతో భారత్ లో టోకు విక్రయదారులకు అమ్మే డీజిల్ పై రూ.25 పెంచారు. భారత్ లోని ప్రధాన చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

రోజువారీ విధానంలో ధరలు పెంచిన భారత చమురు సంస్థలు నవంబరు 4 తర్వాత ఇప్పటివరకు పెట్రో ధరలు పెంచలేదు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు భయపడి కేంద్రం తగు జాగ్రత్తలు తీసుకుంది. ఇటీవల ఎన్నికల ఫలితాలు వచ్చినా, ఆపై పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని చమురు ధరలపై ఎలాంటి ప్రకటన రాలేదు.

అయితే, రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయస్థాయిలో క్రూడాయిల్ ధర 40 శాతం పెరిగింది. ఒక బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్లకు చేరింది. ఈ క్రమంలో భారత్ చమురు సంస్థలు కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అయితే, డీజిల్ టోకు ధర పెంచినా, రిటైల్ ధరలో మార్పేమీ లేదు. మరికొన్నిరోజుల్లో దీనిపై సమీక్ష జరిగే అవకాశం ఉంది. అంటే త్వరలోనే వినియోగదారులపై పెను భారం ఖాయంగా కనిపిస్తున్నది . ఇదే జరిగితే మిగతా అన్ని సరుకులపై ధరల ప్రభావం కచ్చితంగా చూపుతుంది. సామాన్యుడు చితికి పోవడం ఖాయం . ఇప్పటికే కరోనా ప్రభావంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు చమురు ధరల పెంపువల్ల ఆర్థిక పరిస్థితి తల్లకిందులు అయ్యే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అవకాశాలను పరిశీలించిన కేంద్రం ఆంతర్జాతీయ వత్తిడి తో వెనకడుగు వేసినట్లు ఉంది.ఇరాన్ లాంటి దేశాలు భారత్ కు చమురు సరఫరా చేసేందుకు ముందుకు వచ్చాయి. అయినప్పటికీ మనపాలకులు వారినుంచి చమురు తీసుకునేందుకు వెనకంజ వేస్తున్నారు .

Related posts

ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు… సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి

Drukpadam

What’s The Difference Between Vegan And Vegetarian?

Drukpadam

సికింద్రాబాద్ కాల్పుల ఘ‌ట‌న‌పై పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో ఏముందంటే..?

Drukpadam

Leave a Comment