Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పీసీసీ చీఫ్ రేవంత్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ !

పీసీసీ చీఫ్ రేవంత్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ !
-నేను రాజీనామా చేస్తా …దమ్ముంటే నాపై అభ్యర్థిని పెట్టి గెలిపించు
-అప్పుడు నిన్ను హీరోగా గుర్తిస్తా …లేకపోతె జీరో వే
-హోటల్ అశోకాలో కాంగ్రెస్ నేతల సమావేశం
-వీహెచ్, జగ్గారెడ్డి తదితరులు భేటీ
-రేవంత్ వ్యక్తిగతంగా వెళుతున్నాడన్న జగ్గారెడ్డి
-ఇది రేవంత్ వ్యతిరేక సమావేశం కాదన్న మర్రి శశిధర్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. తాజాగా, సీనియర్ నేతలు వి.హనుమంతరావు, జగ్గారెడ్డి తదితరులు హైదరాబాదు అశోకా హోటల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, దమ్ముంటే తనపై అభ్యర్థిని బరిలో దింపి గెలిపించుకోవాలని జగ్గారెడ్డి పేర్కొన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డే హీరో అని ఒప్పుకుంటానని అన్నారు.

వీహెచ్ మంత్రి హరీశ్ రావును కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వీహెచ్ కుమార్తె ఓ డాక్టర్ అని, అందుకోసమే ఆరోగ్యశాఖ మంత్రి అయిన హరీశ్ రావును కలిశారని స్పష్టం చేశారు. దీన్ని కూడా రాజకీయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. పార్టీ నుంచి తమను సస్పెండ్ చేసేది ఎవరు? అంటూ జగ్గారెడ్డి ఆగ్రహంతో ప్రశ్నించారు. రేవంత్ ఒక్కడే పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురాగలడని నిలదీశారు. పార్టీలో సోనియా, రాహుల్ దే అంతిమ నిర్ణయం అని జగ్గారెడ్డి ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా వెళుతున్నాడని ఆరోపించారు. అతని నడవడిక కాంగ్రెస్ పార్టీకి నష్టమని అన్నారు . కొంత మంది భజనపరులను పెట్టుకొని భజన చేయించుకుంటున్నారని ఇది కాంగ్రెస్ పార్టీలో చెల్లదని అన్నారు . రేవంత్ రెడ్డి పాల్గొనే ఏ మీటింగ్ అయిన ,సోనియా , రాహుల్ గాంధీలను కాకుండా రేవంత్ అనే భజనే వినిపిస్తోందని దుయ్యబట్టారు . నాకు షోకాజ్ నోటీసులు ఇస్తామని జరుగుతున్నా ప్రచారం పై స్పందిస్తూ ఇస్తే ఏమైతది . అయిన వీరు ఎవరు నాకు షో కాజ్ నోటీసు ఇవ్వడానికి ,సోనియా , రాహుల్ ఇస్తే అప్పడు ఆలోచిస్తా ? వారే మా నాయకులూ , కాంగ్రెస్ పార్టీ బాగుకోసమే మా తపన కాంగ్రెస్ నాయకులను ,పార్టీని ఏమి అనడంలేదు . రేవంత్ రెడ్డి వల్ల ఒరిగేది ఏమిలేదని మాత్రమే చెప్పదల్చుకున్నా. మిగతా ఎవరితో సమస్య లేదు . మేము లేకుండా ఒక్క రేవంత్ వల్ల ఏమైతది అని జగ్గారెడ్డి ప్రశ్నించారు .

కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, ఇది రేవంత్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశం కాదని స్పష్టం చేశారు. తామేమీ అసమ్మతివాదులం కాదని, మూడేళ్లుగా కలుస్తూనే ఉన్నామని చెప్పారు. సభలకు వచ్చేవాళ్లు ఓటు బ్యాంకుగా మారతారా అనేది కూడా చూసుకోవాలని వ్యాఖ్యానించారు.

పార్టీ కష్టకాలంలో ఉందని, పొరపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని శశిధర్ రెడ్డి హితవు పలికారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని స్పష్టం చేశారు. హైకమాండ్ నిర్ణయాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గత ఎన్నికల్లో ఓటముల దృష్ట్యా రాబోయే ఎన్నికలు పార్టీ మనుగడకు కీలకం అని అభిప్రాయపడ్డారు.

Related posts

టీడీపీ, వైసీపీ రెండూ దొంగల పార్టీలే!: సునీల్ దేవధర్

Drukpadam

సీఎం కేసీఆర్​ పెట్టిన మునుగోడు ‘మెజారిటీ’ పరీక్షలో మంత్రుల ప్రోగ్రెస్​ రిపోర్టు!

Drukpadam

షర్మిల పార్టీ కోసం వడివడిగా అడుగులు

Drukpadam

Leave a Comment