Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రష్యా రక్షణ మంత్రి ఎక్కడికి పోలేదు …

రష్యా రక్షణ మంత్రి ఎక్కడికి పోలేదు …
-ఎట్టకేలకు బయటికి వచ్చిన రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు
-గత కొన్నిరోజులుగా కనిపించకుండా పోయిన షోయిగు
-తీవ్ర అనారోగ్యం బారినపడ్డారంటూ కథనాలు
-రష్యా రక్షణశాఖ స్పందించడం లేదంటూ అమెరికా వ్యాఖ్యలు
-తాజాగా అధికారులతో సమావేశం నిర్వహించిన షోయిగు

ఉక్రెయిన్ పై రష్యా నెలరోజులుగా దాడి చేస్తోంది. తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఎట్టకేలకు బయటికి వచ్చారు. తాజాగా సైనిక, ఆర్థికశాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఆయన కనిపించడంలేదని యుద్ధం చనిపోయి ఉంటాడని లేదా కనిపించకుండా పోయాడని రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. రష్యా ఈ పరిణామాలపై తాజాగా స్పందించింది. మరుసటిరోజే ఆయన రక్షణశాఖకు చెందిన ఉన్నతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు . దీంతో ఆయన ఎక్కడకు పోలేదని ఆరోగ్యం సరిగాలేకపోవడంతో కొంత రెస్ట్ తీసుకున్నారని తెలుస్తుంది.

ఉక్రెయిన్ పై దాడి నల్లేరుపై నడకేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తప్పుడు సమాచారం అందించాడని, అందుకు విరుద్ధంగా ఉక్రెయిన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుండడంతో షోయిగుపై పుతిన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే షోయిగు గుండెపోటుకు గురై చికిత్స పొందుతున్నాడని పరిశోధనాత్మక పత్రిక ఏజెంట్సోటోవ్ పేర్కొంది. అటు, అమెరికా కూడా రష్యా రక్షణ శాఖ తమ కాల్స్ కు స్పందించడంలేదని పేర్కొంటోంది.

ఈ నేపథ్యంలో, సెర్గీ షోయిగు ప్రత్యక్షమయ్యారు. షోయిగు తాజాగా నిర్వహించిన సమావేశం ఫొటోలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే, ఈ సమావేశం ఎప్పుడు జరిగిందన్న దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి.

Related posts

విజయోత్సవాలు ఎన్నికల సంఘం నో…

Drukpadam

ఐటీ రిటర్నుల దాఖలు గడువును పెంచిన కేంద్రం!

Drukpadam

తోపుడు బండి వ్యాపారికి తుపాకులతో బాడీగార్డుల రక్షణ!

Drukpadam

Leave a Comment