Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ భారీ వ్యూహం …రంగంలోకి ప్రశాంత కిషోర్!

కాంగ్రెస్ భారీ వ్యూహం …రంగంలోకి ప్రశాంత కిషోర్!
-చర్చలు జరుపుతున్న రాహుల్, ప్రియాంక
-కాంగ్రెస్ వ్యూహకర్తగా రానున్న ప్రశాంత్ కిశోర్..
-పీకే వద్దంటూ పార్టీ నేతల అభ్యంతరాలు
-ఆయన వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదంటున్న నేతలు
-ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి వ్యూహకర్తగా సునీల్ కనుగోలు
-ఒకే పార్టీకి ఇద్దరు వ్యూహకర్తల వల్ల చేటు తప్పదంటున్న నేతలు

వరుస పరాజయాలతో కుంగిపోతున్న కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కోసం తపిస్తున్న పార్టీ ఆ దిశగా దృష్టిసారించింది. రానున్న గుజరాత్ , కర్ణాటక ఎన్నికలకోసం వ్యూహాలు రచిస్తుంది. వరస ఓటములతో క్రుంగి పోతున్న కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను బరిలోకి దించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. పీకేతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. గుజరాత్‌లో పాతుకుపోయిన బీజేపీని గద్దెదించేందుకు ప్రశాంత్ కిశోర్ పనికొస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అయితే, పార్టీలో కొందరు పీకేపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పీకే కూడా కాంగ్రెస్ కు పనిచేసి తన సత్తా చాటాలని తపనతో ఉన్నారు . గతంలో ఒకసారి సోనియా , రాహుల్ , ప్రియాంక తో ప్రశాంత్ కిషోర్ చర్చలు జరిపారు . అయితే మధ్యలోనే అవి ఆగిపోయాయి. ఒక సందర్భంలో ప్రశాంత కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ముహర్తం కూడా ఖరారు అయిందని వార్తలు వచ్చాయి. ఎందుకో ఆయన మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి దూరమైయ్యారు . ఇప్పుడు తిరిగి పీకే కాంగ్రెస్ ఎన్నిక వ్యూహకర్తగా వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంత అనేది తేలాలంటే మరికొంత కలం ఆగాల్సిందే …

ఆయన వల్ల పార్టీకి ఒరిగేదేమీ ఉండదంటూ ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన గోవాలో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిశోర్ పనిచేసినప్పటికీ అక్కడ ఒక్క సీటును కూడా మమత పార్టీ గెలుచుకోలేకపోయింది. అంతేకాదు, 2017 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పీకే పనిచేసినప్పటికీ దారుణంగా ఏడు సీట్లకే ఆ పార్టీ పరిమితమైంది. వీటిని ఉదాహరణగా పేర్కొంటూ ఆయన రాకపై పార్టీ సీనియర్లు కొందరు పెదవి విరుస్తున్నారు.

మరోవైపు, గతంలో పీకేతో కలిసి పనిచేసిన సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి వ్యూహకర్త బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే రంగంలోకి దిగిన సునీల్ వచ్చే ఏడాది కర్ణాటకలో జరగనున్న ఎన్నికల వ్యూహరచనలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకే పార్టీకి ఇద్దరు వ్యూహకర్తలు ఉంటే అది పార్టీకి మేలు చేయకపోగా, కీడు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.

కాబట్టి ఒకవేళ ప్రశాంత్ కిశోర్‌ను వ్యూహకర్తగా నియమించుకున్నా.. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌కే పరిమితం చేస్తే బాగుంటుందని సలహా ఇస్తున్నారు. కాగా, పీకేతో ఇప్పటి వరకు తొలి విడత చర్చలు మాత్రమే జరిగాయని, ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని అధిష్ఠానంతో సన్నిహిత సంబంధాలున్న నేతలు చెబుతున్నారు.

Related posts

రాళ్ల దాడి…కోడి కత్తి ఏదినిజం ఏది అబద్దం …?

Drukpadam

నేపాల్ నైట్ క్లబ్ వివాదంలో రాహుల్ …కొట్టి పారేసిన కాంగ్రెస్!

Drukpadam

ఈటల రాజేందర్ భార్య జమున స్పీచ్ మైండ్ బ్లోయింగ్!

Drukpadam

Leave a Comment